Smriti Irani: రోడ్డుపక్క చిల్లర కొట్టులో చిప్స్ ప్యాకెట్లు కొన్న స్మృతి ఇరానీ

Smriti Irani in Amethi: అమేథీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన కాన్వాయ్‌ని ఆపి రోడ్డు పక్కన చిల్లరకొట్టులో చిప్స్ ప్యాకెట్లు కొనుగోలు చేశారు.

news18-telugu
Updated: September 11, 2019, 5:22 PM IST
Smriti Irani: రోడ్డుపక్క చిల్లర కొట్టులో చిప్స్ ప్యాకెట్లు కొన్న స్మృతి ఇరానీ
దుకాణంలో చిప్స్ ప్యాకెట్లు కొనుగోలు చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.
  • Share this:
తాను ప్రాతినిధ్యంవహిస్తున్న అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అక్కడ పర్యటిస్తున్నారు. అమేథీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉదయం ఆమె అక్కడకు చేరుకున్నారు. గురువారం రాత్రి వరకు అమేథీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి...అక్కడ జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నియోజకవర్గ పరిథిలో తన చొరవతో భారత ఆర్మీ, రైల్వే శాఖ, టూరిజం శాఖ చేపడుతున్న అభివృద్ధి పనుల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్త పనులకు ఆమె శంకుస్థాపన చేయనున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అమేథీలో స్మృతి ఇరానీ మట్టికరిపించడం తెలిసిందే.

చిప్స్ ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్న స్మృతి ఇరానీ


లక్నో నుంచి రోడ్డు మార్గంలో అమేథీ చేరుకున్న స్మృతి ఇరానీ...అక్కడ తన సింప్లిసిటీని చాటుకున్నారు. రోడ్డు పక్కన ఓ చిల్లరకొట్టు దగ్గర కాన్వాయ్‌ని ఆపించిన ఆమె...అక్కడ చిప్స్ ప్యాకెట్లు కొనుగోలు చేశారు. స్వయంగా తన పర్సులో నుంచి దానికి సంబంధించిన సొమ్మును చెల్లించారు. కేంద్ర మంత్రి రాకతో దుకాణదారుడితో పాటు స్థానికులు ఆశ్చర్యానికి గురైయ్యారు. పాలిథీన్ కవర్లను వినియోగించవద్దని ఈ సందర్భంగా దుకాణదారుడికి స్మృతి ఇరానీ సూచించారు.

Published by: Janardhan V
First published: September 11, 2019, 5:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading