హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

స్పైస్‌ జెట్ విమానంలో వ్యాపించిన పొగలు.. 5 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఘటన..

స్పైస్‌ జెట్ విమానంలో వ్యాపించిన పొగలు.. 5 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఘటన..

క్యాబిన్ లో పొగలు

క్యాబిన్ లో పొగలు

Delhi: విమానంలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జబల్ పూర్ కు వెళ్తున్న స్పైస్‌ జెట్ విమానంలో ఘటన జరిగింది.

స్పైస్‌ జెట్ (Spicejet) విమానంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ప్రయాణికులు ఊపిరి అందక ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ నుంచి జబల్‌పూర్ (Delhi to Jabalpur)  వెళ్లడానికి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలోని ప్రయాణికుల క్యాబిన్‌లో పొగలు వ్యాపించాయి. దీన్నిఅధికారులు, ఎయిర్ హోస్టేస్ సిబ్బంది గమనించారు. అప్పుడు విమానం.. భూమి నుంచి దాదాపు.. 5,000 అడుగుల ఎత్తులో ఉంది. దీంతో అధికారులు వెంటనే ఢిల్లీలోని విమాన సిబ్బందికి సమాచారం అందించారు. విమానం తిరిగి రన్ వే మీద చేరడానికి ఎయిర్ ట్రాఫిక్ ను అధికారులు క్లియర్ చేశారు.

ఈ క్రమంలో.. జబల్‌పూర్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ (SpiceJet Flight) విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. క్యాబిన్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు గాలి పీల్చుకొవడానికి తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించి వీడియోలో.. ఫ్లైట్‌లోని ప్రయాణికుల క్యాబిన్ పొగతో నిండి ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. కాగా, ‘‘ఢిల్లీ నుంచి జబల్‌పూర్‌కు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఈ రోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి వచ్చింది. సిబ్బంది 5000 అడుగులు దాటిన సమయంలో క్యాబిన్‌లో పొగను గమనించారు.

ప్రయాణికులు సురక్షితంగా దిగారు’’ అని స్పైస్‌జెట్ అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా కిందకు ల్యాండ్ అవ్వడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణిల కోసం అధికారులు... ప్రత్యేక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. మరో విమానంలో ప్రయాణికులను జబల్ పూర్ పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం  ఈ వీడియో నెట్టింట (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.

చింపాంజి పులి పిల్లలను అమ్మలా లాలించింది.

అమెరికాలోని (america) సౌత్ కరోలినా లోని మిర్టిల్ బీచ్ సఫారీలో చింపాంజీ, మూడు పులి పిల్లలను ప్రేమగా లాలిస్తుంది. అచ్చం అవి తమ తల్లి వద్ద ఉన్నట్లు వాటితో గడుపుతున్నాయి. చింపాంజీ (Orangutan) కూడా పులి పిల్లలకు పాలు తాగిస్తు.. వాటిని తన చేతుల్లో ఎత్తుకుంది. ఆ తర్వాత.. దాన్ని ప్రేమగా నిమురుతూ.. కౌగిలించుకుంటూ.. భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు ఎమోషన్ కు (Emotional   Video)  గురౌతున్నారు. మిర్టిల్ బీచ్ సఫారీలో చింపాంజీ, మూడు పులి పిల్లలకు (Tiger cubs) సర్రోగేట్ మదర్ గా మారినట్లు తెలుస్తోంది.

First published:

Tags: Delhi Airport, Flight, SpiceJet, Viral Video

ఉత్తమ కథలు