వింత పండు వాసనతో ఖాళీ అయిన పోస్టాఫీస్... ఆస్పత్రిలో చేరిన ఆరుగురు...

ఇలాంటివి ఎప్పుడో అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఎంతో ఫన్ తెప్పిస్తాయి. ఇది అలాంటిదే. ఏం జరిగిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: June 24, 2020, 12:20 PM IST
వింత పండు వాసనతో ఖాళీ అయిన పోస్టాఫీస్... ఆస్పత్రిలో చేరిన ఆరుగురు...
వింత పండు వాసనతో ఖాళీ అయిన పోస్టాఫీస్... ఆస్పత్రిలో చేరిన ఆరుగురు...(credit - twitter)
  • Share this:
అది జర్మనీలోని ష్వీన్‌ఫర్ట్. అక్కడో పోస్టాఫీస్ ఉంది. రోజూ ఏవో ఒక లెటర్లు, పార్సిళ్లు వస్తుంటాయి. తాజాగా ఓ పెద్ద పార్మిల్ వచ్చింది. దాన్ని ఓ చోట ఉంచారు. కాసేపటికి ఏదో వాసన రావడం మొదలైంది. అందరి ముక్కులకూ కరోనా మాస్కులు ఉన్నా... ఆ వాసన ఆగలేదు. అంతకంతకూ అది పెరిగిపోతుంటే... ఆఫీసులో ఎవరో... అమ్మో గ్యాస్ లీకైనట్లుంది అన్నారు. అంతే... అప్పటికే... చాలా మంది... దగ్గుతూ, కడుపులో తిప్పుతున్నట్లు ఫీలై... "ఓ నో" అనుకుంటూ... దగ్గర్లోని ఆస్పత్రికి పరుగులు పెట్టారు. ఇలా ఆరుగురు వెళ్లిపోయారు. మిగతావాళ్లు... మనమూ వెళ్లాలి అనుకున్నారు. అందరూ వెళ్లిపోతే ఎలా అని మరికొందరు అన్నారు. ఓ పని చేద్దాం. ముందు ఆఫీస్ లోంచీ బయటకు వెళ్లిపోదాం.... అవునవును అనుకుంటూ... అందరూ బయటకు వెళ్లిపోయారు.

వెంటనే పోలీసులకు కాల్ చేశారు. కొన్ని క్షణాలకే అక్కడకు వచ్చిన పోలీసులు, ఫైర్ సిబ్బంది... ఏం జరిగింది అని అడిగితే... "సార్... గ్యాస్ లీకైనట్లుంది. ఆఫీస్‌లో గ్యాస్ వాసన వస్తోంది. భరించలేకపోతున్నాం" అన్నారు. "మరి మేమూ మనుషులమేగా... మేం కూడా ఆ గ్యాస్ పీల్చకూడదు" అంటూ పోలీసులు... ఆస్పత్రి నుంచి ప్రత్యేక ఎయిర్ ఫేస్ షీల్డుల వంటివి తెప్పించారు.

ఆ తర్వాత పోస్టాఫీస్ బయట, లోపలా అంతా వెతికినా... ఎక్కడా ఏ గ్యాసూ లీకవుతున్నట్లు కనిపించలేదు. మరైతే ఆ వాసన ఏంటి అని పోలీసులకు అనిపించింది. ఓసారి గ్యాస్ షీల్డ్ తీసి వాసన చూశారు. దాన్ని పీల్చుతూ.. "ఛీ ఏంటిది... ఇంత చండాలంగా ఉంది" అనుకుంటూ... బయటకు వెళ్తుంటే... ఓ పార్శిల్ దగ్గరకు రాగానే... వాసన మరింత ఎక్కువైంది. దాంతో ఆ పోలీసుకు డౌట్ వచ్చింది. మరోసారి పార్సిల్ దగ్గరకు వెళ్లి వాసన చూశాడు. గుప్పు గుప్పు మంటూ అందులోంచీ వాసన వస్తూ ఉంది.

"వాటీజ్ దిస్" అని చెక్ చేస్తే... దానిపై డ్యురియన్ పండు (DURIAN fruit) అని ఉంది. అత్యంత జాగ్రత్తగా దాన్ని తెరచి చూశారు. లోపల పై ఫొటోలో లాంటి పండు ఉంది. అదే ఆ వాసనకు కారణం అని అర్థమైంది. ఈ విషయం తెలియగానే... ఓ ఆసియా వ్యక్తి దాన్ని గుర్తించాడు. ఆ పండు అలాంటి వాసనే వస్తుందనీ... కానీ తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుందని చెప్పాడు. అవి ఆసియా దేశాల్లో మాత్రమే పండుతాయి కాబట్టే... ఎవరో దాన్ని డెలివరీ చేయించుకొని ఉంటారని అన్నాడు. పోలీసులతోపాటూ... పోస్టాఫీసుకి చెందిన 60 మంది ఉద్యోగులు, సిబ్బందీ ఆశ్చర్యపోయారు. ఇదంతా పండు వాసనా అంటూ వింతగా చూశారు.

డ్యురియన్ పండు... కుళ్లిపోయిన ఉల్లిపాయ వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన పీల్చితే... వికారం రావడం సహజం. అందుకే ఈ పండును చాలా హోటళ్లు బ్యాన్ చేశాయి. దీని రుచి బాగుండటంతో... తినేటప్పుడు నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే లాంటి లక్షణం వల్ల తూర్పు, ఆగ్నేయ ఆసియాలో దీన్ని ఇష్టంగా తింటారు.


ఈ పండు పుణ్యమా అని... ఆరు అంబులెన్సులు, ఐదు ఫస్ట్ రెస్పాండర్ కార్లు, రెండు ఎమర్జెన్సీ వెహికిల్స్, ఫైర్ సిబ్బంది... పోస్టాఫీస్ దగ్గరకు వచ్చారు. 12 మందిని డాక్టర్లు టెస్ట్ చేశారు. ఆరుగురికి మందులు ఇచ్చారు. అంతా అయ్యాక... ఆ పార్శిల్‌ని ప్రత్యేకంగా దానిపై ఉన్న అడ్రెస్‌కు చేర్చారు.
డ్యురియన్ పండు వల్ల ఇంత హంగామా జరగడం ఇదే తొలిసారి. గతేడాది కాన్బెర్రా యూనివర్శిటీ లైబ్రరీలో ఓ కుర్రాడు దీన్ని తెచ్చుకున్నాడు. అంతే... గ్యాస్ లీక్ అని కంగారు పడ్డారు. ఐతే... ఎవరూ టెన్షన్ పడొద్దనీ... తను తెచ్చిన ఫ్రూట్ ప్రత్యేకతను చెప్పడానికే దాన్ని తెచ్చానని వాళ్లకు చూపించడంతో... అంతా ఊపిరిపీల్చుకున్నారు.
First published: June 24, 2020, 12:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading