కరెంటు బిల్లు కట్టడం లేదా.. ఇది షాకిచ్చే వార్తే..

స్మార్ట్ మీటర్లు (File)

Smart Meter : కరెంటు బిల్లు కట్టకపోతే ఆటోమేటిక్‌గా విద్యుత్తు సరఫరా నిలిచిపోయేలా చర్యలు తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. అదీ అతి త్వరలోనే. ‘స్మార్ట్ మీటర్’తో కరెంటు ఆర్థిక కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సమయాత్తమైంది.

 • Share this:
  Smart Meter : కరెంటు బిల్లు కట్టకపోతే ఇప్పుడు మహా అయితే ఫైన్ పడుతుంది. అది కూడా తక్కువే. చాలా తక్కువ సందర్భాల్లో ఫ్యూజ్ తీసుకెళ్లిపోవడమో.. కరెంట్ సప్లై ఆపేయడమో జరుగుతూ ఉంటుంది. అయితే.. కరెంటు బిల్లు కట్టకపోతే ఆటోమేటిక్‌గా విద్యుత్తు సరఫరా నిలిచిపోయేలా చర్యలు తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. అదీ అతి త్వరలోనే. ‘స్మార్ట్ మీటర్’తో కరెంటు ఆర్థిక కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సమయాత్తమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2022 నాటికల్లా ఇండియాలోని అన్ని ఎలక్ట్రిసిటీ మీటర్లనూ... స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చేయాలని టార్గెట్ పెట్టుకుంది. దేశమంతా 24 గంటలూ ఎలక్ట్రిసిటీ అందేలా, ఒకటే పవర్ గ్రిడ్ ఉండేలా చర్యలను ముమ్మరం చేసింది.

  స్మార్ట్ మీటర్ వల్ల మనుషులకు పని తగ్గుతుంది. మీటర్‌ను చెక్ చెయ్యడం, బిల్లు వెయ్యడం, మనీ కలెక్ట్ చెయ్యడం వంటి పనులు ఇకపై ఉండవు. స్మార్ట్ మీటర్లతో బిల్లు ఎంతో ఎప్పటి కప్పుడు తెలుసుకోవచ్చు, ఎంత కరెంటు వాడుతున్నదీ క్షణాల్లో తెలిసిపోతుంది. ఎంత కరెంటు వాడుకోవాలో, అంతకు సరిపడా ముందే ప్రీపెయిడ్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్‌పెయిడ్ విధానంలో బిల్లులు పే చెయ్యవచ్చు.

  ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ల వల్ల... చాలా చోట్ల బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతోంది. దాని వల్ల డిస్కంలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. బ్యాంకింగ్ రంగంపైనా దాని ప్రభావం ఎక్కువగానే పడుతోంది. ఎలక్ట్రిసిటీ రంగంలో దాదాపు రూ.లక్ష కోట్ల లోన్లు ఉన్నాయి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. వినియోగదారులు కూడా ఎలక్ట్రిసిటీని సమర్థంగా వాడుకునేందుకు వీలవుతుంది. ఒక్కో స్మార్ట్ మీటర్ రూ.6వేలు ఉంటుందని తెలుస్తోంది. దీన్ని ఉచితంగా అన్ని ఇళ్లల్లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. కాగా, పోస్ట్‌పెయిడ్ స్మార్ట్ మీటర్ వాడితే.. ఒకవేళ కరెంటు బిల్లు కట్టకపోతే.. విద్యుత్తు సంస్థల అధికారులు వినియోగదారుడి ఇంటికి వచ్చే అవసరం లేకుండానే కరెంట్ కట్ చేస్తారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: