గేదెను నిచ్చెనగా మార్చుకున్న మేక... తెలివైనదంటూ నెటిజన్ల జోక్స్... వైరల్ వీడియో...

మనుషులకు ఎలా తెలివితేటలుంటాయో... అలాగే ఆ మేక కూడా కాస్త తెలివిగా ఆలోచించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

news18-telugu
Updated: July 1, 2020, 10:17 AM IST
గేదెను నిచ్చెనగా మార్చుకున్న మేక... తెలివైనదంటూ నెటిజన్ల జోక్స్... వైరల్ వీడియో...
గేదెను నిచ్చెనగా మార్చుకున్న మేక... తెలివైనదంటూ నెటిజన్ల జోక్స్... వైరల్ వీడియో... (credit - twitter)
  • Share this:
మనకు ఆకలి వేస్తే... ఆహారం తింటాం. మేకలు ఆకులు తింటాయి. మరి ఆ ఆకులు దొరకకపోతే... ఆ మేకకు అదే సమస్య ఎదురైంది. తనకు కావాల్సిన ఆహారం ఎక్కడ ఉందా అని చాలా చోట్ల తిరిగింది. కానీ ఎక్కడా ఆకులు కనిపించలేదు. "అయ్యో ఇప్పుడు నా పరిస్థితేంటి... నా ఆకలి తీరేదెలా" అనుకుంది. అదే సమయంలో... ఓ పెద్ద చెట్టు మేకకు కనిపించింది. ఆ చెట్టు ఆకుల్ని చూడగానే మేక నోరు ఊరించి. "అది నా ఆహారమే" అని సంబరపడింది. అంతలోనే దిగాలు. ఎందుకంటే... ఎంత ఎగిరినా ఒక్క ఆకు కూడా అందే పరిస్థితి లేదు. "ఏం చెయ్యాలిరా దేవుడా" అనుకుంటూ ఆ మేక దిక్కులు చూస్తుంటే... దానికి ఓ కత్తి లాంటి ఐడియా వచ్చింది.

ఆ చెట్టు దగ్గరే... ఓ గేదె... ఆహారం తింటూ కనిపించింది. మేక దానివైపు చూసి... అలా చేస్తే బెటరే... అనుకుంటూ... ఒక్కసారిగా గేదె తలపై నుంచి... నిచ్చెన ఎక్కినట్లుగా పైకి ఎక్కేసింది. పైకి ఎక్కిన తర్వాత... ఆకులు చక్కగా నోటికి అందాయి. అంతే వాటిని లాక్కొని పరపరా నములుతూ అదీ లెక్క అనుకుంది. తనపై ఓ మేక ఎక్కినా ఆ గేదె కూడా... పోనీలే.. ఆకలి తీర్చుకుంటోంది అని ఊరుకుందే... తప్ప దాన్ని ఏమీ అనలేదు.


ఈ వీడియో వైరల్ అయిపోయింది. చాలా మంది దీన్ని చూసి... అవసరం ఎన్ని ఆలోచనలైనా వచ్చేలా చేస్తుంది అని అంటున్నారు. ఆ మేక మనుషులలాగా ఆలోచించడం ఇంట్రస్టింగ్ అంటున్నారు. తెలివైన మేక అని మెచ్చుకుంటున్నారు.

నిజానికి ఇది ఇప్పటి వీడియో కాదు. చాలా కాలం నాటిది. కానీ... ఇప్పుడు దీన్ని IFS ఆఫీసర్ సుధా రామెన్... ట్వీట్ చెయ్యడంతో... ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఇప్పటికే దీన్ని 14వేల మంది చూడగా... 12వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది నవ్వు తెప్పించే ఇమోజీలను కామెంట్లలో పెడుతున్నారు.
First published: July 1, 2020, 10:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading