వధువు కావలెను.. అని షాప్‌ ముందు బోర్డ్ పెట్టాడు.. అనూహ్య పరిణామంతో షాక్!

ఉన్ని కృష్ణన్ (image credit - twitter)

Life Partner: తనకు పెళ్లి జరగాలనీ, మంచి భార్య తోడుగా రావాలని కలలుకన్నాడు. అందరిలా కాకుండా భిన్నంగా చేశాడు. మరి దాన్ని ఫలితం ఏమైందో తెలుసుకుందాం.

 • Share this:
  అందరూ వెళ్లే దారిలో వెళ్లడం కొందరికి నచ్చదు. అందరూ చేసినట్లు వారు చెయ్యాలి అనుకోరు. కాస్త కొత్తగా చేద్దామనే ఆలోచనలు వారికి ఉంటాయి. కేరళ (kerala).. త్రిచూర్‌లోని 33 ఏళ్ల ఉన్నికృష్ణన్ (unnikrishnan)... అదే చేశాడు. తన పెళ్లికి సంబంధించి పెళ్లిళ్ల పేరయ్యనో లేక... షాదీ వెబ్‌సైట్ల (Shadi websites)నో కలవకుండా... తన టీ స్టాల్ ముందే వధువు కావాలి (want life partner) అని బోర్డు పెట్టాడు. కులం, మతంతో సంబంధం లేదు అని రాసి తన మొబైల్ నంబర్ ఇచ్చాడు ఈ వల్లచిర స్థానికుడు. తన వయసు 33 కాబట్టి.. తనకు ఎవరో ఒకరు జీవిత భాగస్వామిగా వస్తే బాగుండు అనుకున్నాడు. అంతలోనే షాక్ అయ్యాడు.

  విదేశాల నుంచి కాల్స్:
  ఉన్నికృష్ణన్‌ తగిలించిన సైన్ బోర్డును అతని ఫ్రెండ్ ఫొటో తీసి... సోషల్ మీడియాలో వేశాడు. అది కాస్తా వైరల్ (viral) అయ్యింది. దాంతో అతనికి ఆస్ట్రేలియా (Autralia), ఇంగ్లండ్ (England) లాంటి దేశాల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి.


  ఇదీ ఉన్ని జీవితం:
  తన సైన్ బోర్డ్ పోస్టుపై సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతోందనేది పట్టించుకోకుండా ఉన్ని కృష్ణన్... వీధిలో ఉండే తన షాపులో కూర్చొని.. తనకు ఎక్కడెక్కడి నుంచి ఎలాంటి ప్రపోజల్స్ (marriage proposals) వచ్చాయో చూసుకుంటున్నాడు. "నేను రోజువారీ కూలీని. నా తలలో కణతి ఉండటంతో సర్జరీ కూడా జరిగింది. దాని నుంచి పూర్తిగా రికవరీ అయ్యాను. అందువల్ల ఇప్పుడు జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నా. లక్కీగా ఓ లాటరీ (lottery) తగలడంతో టీస్టాల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నను. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు సంబంధాలు వెతికారు. అవేవీ సెట్ కాలేదు. అందుకే ఇలా సైన్ బోర్డ్ పెట్టాను" అని ఉన్నికృష్ణన్ తెలిపాడు.

  సాజీ ఏమన్నాడంటే:
  "నేను ఉన్ని ఫ్రెండుని. నా పేరు సాజీ. నేనే ఆ సైన్ బోర్డ్ ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాను. ఇప్పుడు ఉన్నికి వేరే దేశాల (foreign) నుంచి మలయాళీలు ఫోన్లు చేస్తున్నారట. కొంత మంది ఉన్నికి మంచి భవిష్యత్తు ఉండాలని కాల్ చేసి విషెస్ చేస్తున్నారు. కులం, మతంతో సంబంధం లేదని ఉన్ని చెప్పడం చాలా మందికి నచ్చుతోంది. ఓ వ్యక్తి మాత్రం జీవిత భాగస్వామిని సోషల్ మీడియాలో వెతుక్కుంటారా ఎవరైనా అని సీరియస్ అయ్యాడు" అని సాజీ తెలిపాడు.

  ఇది కూడా చదవండి : Monthly Horoscope: మాస ఫలాలు. సెప్టెంబర్ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?

  ప్రస్తుతం ఉన్నికృష్ణన్‌కి రోజూ కాల్స్ వస్తున్నాయి. చాలా మంది పూర్తి వివరాలు ఇవ్వమని అడుగుతున్నారు. ఐతే... ఆ వివరాల్ని సోషల్ మీడియాలో పెట్టమని అడుగుతున్నారు. పర్సనల్ వివరాల్ని సోషల్ మీడియాలో పెట్టడం సరికాదని సాజీ అంటున్నాడు. మరి ఉన్నిని పెళ్లాడే వధువు ఎక్కడుందో!
  Published by:Krishna Kumar N
  First published: