SKY DIVE MADHYA PRADESH OTHER PLACES IN INDIA EXPERIENCE THRILLING ADVENTURE SPORT GH VB
SkyDive: హైదరాబాద్‌లో స్కైడైవింగ్ చేసే అవకాశం.. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోనూ అందుబాటులోకి..!
ప్రతీకాత్మక చిత్రం
దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్కై డైవింగ్ చేసే అవకాశాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అందమైన ప్రాంతాల్లో అద్బుతమైన అనుభవాలను సాహస ప్రియులకు అందించేలా ఆయా రాష్ట్రాల పర్యాటక విభాగాలు ఏర్పాట్లు చేశాయి. ఆ వివరాలు చూద్దాం.
అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో(Sports) పాల్గొనాలని అనుకొంటున్నవారికి, న్యూఇయర్ రెసెల్యూషన్లో అడ్వెంచర్‌ను ఎంజాయ్ చేయడాన్ని భాగం చేసుకొన్న వారికి శుభవార్త. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్కై డైవింగ్ చేసే అవకాశాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అందమైన ప్రాంతాల్లో అద్బుతమైన అనుభవాలను సాహస ప్రియులకు అందించేలా ఆయా రాష్ట్రాల పర్యాటక విభాగాలు ఏర్పాట్లు చేశాయి. తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని హైదరాబాద్ వద్దనున్న నాగార్జునసాగర్ వద్ద స్కై డైవింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. సివిలియన్ స్కై డైవింగ్‌కు(SkyDive) గ్లోబల్ బాడీ అయిన యునైటడ్ పారాచ్యూట్ అసోసియేషన్ సహకారంతో నాగార్జునసాగర్ ఎయిర్పోర్ట్ స్కై డైవింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అనుభవమున్న టైనర్స్ మూడు రోజులపాటు శిక్షణ ఇస్తారు. 4,000 అడుగుల ఎత్తునుంచి స్టాటిక్లైన్ జంప్ చేసేలా సిద్ధం చేస్తారు. స్కై డైవింగ్ చేసే సమయంలో కృష్ణా నది అందాలు, చుట్టుపక్కల కొలువుదీరిన ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.
మధ్యప్రదేశ్‌లో అద్భుత అవకాశం
భోపాల్, ఉజ్జయినిలో స్కై డైవింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మధ్యప్రదేశ్ పర్యటకశాఖ ప్రకటించింది. మార్చి 1, 2వ తేదీల్లో భోపాల్, 3 నుంచి 6వ తేదీ వరకు ఉజ్జయినిలో స్కై డైవింగ్ క్యాంప్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అలిఘర్‌కు చెందిన పయనీర్ ఫ్లైయింగ్ అకాడమీ సహకారం అందిస్తోంది. 10,000 అడుగుల నుంచి ఇక్కడ స్కై డైవింగ్ చేయవచ్చు.
నార్నాల్, హర్యానా
నార్నాల్‌లోని బచ్చోద్ ఎయిర్‌స్ట్రిప్ వద్ద స్టాటిక్ లైన్, ట్యాండమ్ జంప్ అవకాశం ఉంది. బిగెనర్స్ ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ట్యాండమ్ ఇన్స్ట్రక్టర్లు అందుబాటులో ఉంటారు. స్టాటిక్ లైన్ జంప్ చేయాలంటే పయనీర్ ఫ్లైయింగ్ అకాడమీ ద్వారా రెండు రోజుల శిక్షణ ఉంటుంది. స్కై డైవింగ్‌కు ముందు పరీక్షను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆంబీ వ్యాలీ సిటీ, మహారాష్ట్ర
ఆబబీ వ్యాలీ సిటీలో అమెరికన్, యురోపియన్ స్కై డైవింగ్ ఇన్స్ట్రక్టర్లు అందుబాటులో ఉన్నారు. 45 నిమిషాలపాటు సూచనలు, జాగ్రత్తలు వివరించి 10,000 అడుగుల నుంచి స్కై డైవింగ్ చేసేందుకు తీసుకెళ్తారు. స్టాటిక్, ట్యాండెమ్ జంపింగ్ అవకాశాలు ఉన్నాయి.
మైసూరు, కర్ణాటక
మైసూరు అంటే అందరికీ ప్యాలస్ గుర్తు వస్తుంది. సముద్రమట్టానికి 10,000 వేల అడుగుల నుంచి ఇక్కడ స్కై డైవింగ్ చేసే అవకాశం ఉంది. రెండు రోజుల శిక్షణ తప్పనిసరి.
దీసా, గుజరాత్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గుజరాత్, ఇండియన్ ప్యారాచూటింగ్ ఫెడరేషన్ దీసాలో స్కై డైవింగ్‌ను తీసుకొచ్చాయి. ట్యాండమ్ జంప్‌ను 10,000 వేల అడుగుల నుంచి చేయవచ్చు. కొన్ని గంటలపాటు నిబంధనలు, జాగ్రత్తలు వివరిస్తారు. స్టాటిక్లైన్ జంప్ చేయాలంటే ఒకటిన్నర రోజు శిక్షణ ఉంటుంది. 3,500 నుంచి 4,000 వేల అడుగుల నుంచి స్కై డైవ్ చేయవచ్చు.
పుదుచ్చేరి, తమిళనాడు
ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, సముద్రతీరాల అందాలతో నిండిన పుదుచ్చేరిలో అడ్వెంచర్ స్పోర్ట్సలకు కొదవలేదు. పుదుచ్చేరి ఎయిర్‌బేస్ నుంచి స్కై డైవింగ్ చేయవచ్చు. ఇక్కడ కూడా స్టాటిక్లైన్, ట్యాండమ్ జంపింగ్ అందుబాటులో ఉంది.
అలీఘర్, ఉత్తరప్రదేశ్
అలిఫర్లో స్కై డైవింగ్ చేయాలంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. 9 నుంచి 12 వరకు మాత్రమే స్కై డైవింగ్‌కు అనుమతి ఉంటుంది. రోజుకు 5 స్లాట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.