అమ్మ వద్దంటే వినలేదు.. చివరకు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు...

మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లాడు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు.

news18-telugu
Updated: March 7, 2019, 12:28 PM IST
అమ్మ వద్దంటే వినలేదు.. చివరకు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు...
(Image:Scran Grab)
news18-telugu
Updated: March 7, 2019, 12:28 PM IST
చైనాలో ఓ పిల్లాడు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు. సుమారు గంటకు పైగా టాయిలెట్‌లోనే కూర్చుని మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూర్చున్న పిల్లాడు పైకి లేద్దామనుకునే సరికి లేవలేకపోయాడు. దీంతో తాను ఇరుక్కుపోయానన్న విషయం అర్థమైంది. ఆ పిల్లాడు గట్టిగా కేకలు వేయడంతో చివరకు తల్లి వచ్చి అతడిని బయటకు లాగే ప్రయత్నం చేసింది. పిల్లాడు పూర్తిగా టాయిలెట్‌ ఇరుక్కుపోవడంతో ఆమె వల్ల కాలేదు. దీంతో వెంటనే అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసింది. ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ పిల్లాడిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు.

మొదట చిన్న కత్తితో టాయిలెట్ పై సీటు కట్ చేశారు. ఆ తర్వాత ఇతర వస్తువులు వాడి టాయిలెట్‌ కమోడ్‌ను కట్ చేసి పిల్లాడిని బయటకు తీశారు. అయితే, చిన్న చిన్న గాయాలతోనే బుడతడు క్షేమంగా బయటపడ్డాడు. దీంతో ఆ తల్లి ఊపిరిపీల్చుకుంది.


తాను వద్దు అని చెబుతున్నా వినకుండా పిల్లాడు మొబైల్ ఫోన్ టాయిలెట్‌లోకి తీసుకెళ్లాడని తల్లి చెప్పింది. సుమారు గంటసేపు అలా టాయిలెట్ మీద కూర్చుని ఆటలో నిమగ్నం అయిపోవడంతో టాయిలెట్‌లో ఇరుక్కుపోయిన విషయాన్ని కూడా గ్రహించలేకపోయాడు. ఎలాగోలా బయటపడడంతో ఆ తల్లి సంతోషం వ్యక్తం చేసింది. అయితే, టాయిలెట్‌లో నుంచి పిల్లాడిని రక్షించే సీన్ ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లాడు ఉన్నాడేమో చెక్ చేసుకోండి అంటూ ఫైర్ ఫైటర్లు స్థానికులకు సూచిస్తున్నారు.

First published: March 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...