SIX YEAR OLD KID SPENDS RS 11 LAKHS ON ONLINE GAME PURCHASES FROM MOTHERS CREDIT CARD BA GH
ఆరేళ్ల పిల్లాడు రూ.11 లక్షలు ఖర్చు.. పైగా అమ్మకి నేను తిరిగిస్తాలే అన్నాడు.. ఇంతకీ ఆ డబ్బుతో ఏం చేశాడు?
ప్రతీకాత్మక చిత్రం
అమెరికాలోని విల్టన్ కు చెందిన జార్జ్ జాన్సన్ అనే ఓ ఆరేళ్ల పిల్లవాడు 16,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.11.80 లక్షలు ఖర్చు చేశాడు. తనకిష్టమైన వీడియో గేమ్ కోసం యాపిల్ స్టోర్లో (Apple Store) తన తల్లి క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేశాడు.
పిల్లల చేతులకు డబ్బు ఇవ్వకూడదు.. ఇస్తే వారికి తెలియకుండానే వాటిని ఖర్చు చేస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ వారి చేతికి డబ్బు ఇవ్వకపోయినా ఖర్చు పెడతారనే విషయం మీకు తెలుసా? అవును. అమెరికాలోని విల్టన్ కు చెందిన జార్జ్ జాన్సన్ అనే ఓ ఆరేళ్ల పిల్లవాడు 16,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.11.80 లక్షలు ఖర్చు చేశాడు. తనకిష్టమైన వీడియో గేమ్ కోసం యాపిల్ స్టోర్లో (Apple Store) తన తల్లి క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేశాడు. తీరా ఆరా తీస్తే ఆ డబ్బు నేనే చెల్లిస్తానని తల్లికి బదులిచ్చాడు. న్యూయార్క్ పోస్ట్ వార్తా కథనం ప్రకారం జెస్సికా జాన్సన్ కు జార్జ్ అనే కుమారుడు ఉన్నాడు. ఐఫోన్ లో వీడియో గేమ్ ఆడిన ఆ పిల్లవాడు గేములో వివిధ స్థాయిలకు చేరుకునేందుకు, యాడ్స్ లేకుండా ఉండేందుకు పదే పదే క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు చెల్లించాడు. గేములోని ఓ స్థాయి అయిన రెడ్ రింగ్స్ కోసం 1.99 డాలర్లు, అక్కడ గోల్డ్ రింగ్స్ కోసం 99.99 డాలర్లను చెల్లించాడు. ఈ విధంగా మరింత వేగంగా, సౌకర్యవంతంగా ఆడేందుకు గాను పదేపదే డబ్బు చెల్లిస్తూనే ఉన్నాడు. జులైలో జరిగిన ఈ విషయాన్ని జెస్సికా గమనించలేదు. జులై నెల క్రెడిట్ కార్డు బిల్లును చూసి అవాక్కయింది. దాదాపు 25 సార్లు వివిధ రకాలుగా యాపిల్, పేపాల్(Paypal) ఖాతాల నుంచి 2,500 డాలర్లు (సుమారు రూ.11,80,000) కట్ అయినట్లు తెలుసుకుంది.
దీంతో సదరు సంస్థలపై కోర్టులో పిటీషన్ వేసింది. తనకు తెలియకుండా లావాదేవీలు జరిగాయని, అసలు ఇలా జరగడం అసాధ్యమని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఆ సమయంలో తన కొడుకు ఖర్చు చేసినట్లు తెలియదు. అక్టోబరు వరకు అతడు క్రెడిట్ కార్డు వాడుతుండంతో బిల్లు 16,293 డాలర్లు (రూ.11.80 లక్షలు) చెల్లించాలని తెలిసింది. దీనిపై యాపిల్ సంస్థ స్పందించాలిని న్యాయస్థానం ద్వారా అడిగింది.
అయితే ఎట్టకేలకు తన ఆరేళ్ల కుమారుడే ఈ ఖర్చు చేసినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయింది. అయితే ఇంత సొమ్ము లావాదేవీ జరుగుతున్నప్పుడు యాపిల్ సంస్థ 60 రోజుల్లో చర్చించి సహాయం చేయ లేదని పేర్కొంది. యాపిల్, పే పాల్ మోసపూరిత ఆరోపణలు చేసిందని అప్పుడు పిలవలేదని ఆమె అన్నారు. తన ఖాతాలో సెట్టింగ్సు మార్చుకోలేదని విషయాన్ని మాత్రం అంగీకరించింది. "స్పష్టంగా ఉందని నాకు తెలిసి ఉంటే ఆరేళ్లకే వర్చువల్ గోల్డ్ కాయిన్స్ (Virtual gold coins) కోసం 20వేల డాలర్లు వసూలు చేయడానికి అనుమతించడం ఏంటి" అని నివేదిక ఆమెను ఉటంకిస్తూ పేర్కొంది.
అయితే తల్లి ఈ కేసును ఎదుర్కొంటున్నప్పుటు ఆరేళ్ల జార్జ్ "సరే నేను నీకు తిరిగి చెల్లిస్తాను అమ్మ" అని తెలపడం విశేషం. అంతేకాకుండా జెస్సికా జాన్సన్ యాపిల్, గేమ్ డిజైనర్లను నిందించింది. ఈ ఆటలు దోపిడి చేస్తున్నాయని, పిల్లలు తెలియకుండా కొనుగోలు చేస్తున్నారని తెలిపింది. గేములో వస్తున్న డబ్బు నిజమా, అబద్దమా అనే విషయం తన కుమారుడికి అర్థమయ్యే వయసు కాదని చెప్పింది. కార్టున్ గేమ్ అనేది నిజమా, కాదా అని అతడి ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.