ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఓ బైకర్(Biker)తన టూవీలర్(Two wheeler)ని కారు(Car)గా మార్చేశాడు. అంటే రెండు టైర్లకు బదులు నాలుగు టైర్లు అమర్చి దానికి క్యాబిన్ ఏర్పాటు చేయలేదు. ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగిన బైక్‌పై తాను కాకుండా మరో ఐదుగురు పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్తాడు. రోడ్డుపైన ఇంత వెరైటీ దృశ్యం కనిపిస్తే ఎవరు వదిలేస్తారు చెప్పండి అందుకే కారులో వెళ్తున్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్(Cell phone)తో వీడియో తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశాడు. అంతే ఇప్పుడు ఆ వీడియోనే తెగ వైరల్(Video viral) అవుతోంది. బైకర్ చేసిన స్టంట్ చూసి అందరూ ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
స్టంట్ కాదు రియల్ సీన్ ..
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఓ బైకర్ తన టూవీలర్‌పై ఐదుగురు పిల్లల్ని ఎక్కించుకున్నాడు. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. తాను డ్రైవ్ చేస్తూ తన ముందు పెట్రోల్ ట్యాంక్‌పై ఇద్దర్ని కూర్చొబెట్టుకున్న యువకుడు తన వెనుక మరో ముగ్గుర్ని కూర్చొబెట్టుకున్నాడు. ఝాన్సీలోని బాలాజీ రోడ్డులో ఈవిధంగా ఆరుగురు ఒకే బైక్‌పై వెళ్తుండటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సిప్రీ బజార్ పోలీస్ స్టేషన్‌కి అత్యంత సమీపంలోనే ఈసంఘటన చోటుచేసుకోవడం విశేషం.
బైక్‌ని కారుగా మార్చిన రైడర్..
బైక్‌పై ఇద్దరూ లేదా ముగ్గురు మాత్రమే ప్రయాణిస్తారు. అలాంటిది అరడజను మంది ప్రయాణించడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. బైక్‌పైన ఆరుగురు వెళ్తుంటే అదే రోడ్డులో కారులో వెళ్తున్న వ్యక్తి చూసి ఆశ్చర్యపోయి వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈవిధంగా ఇష్టం వచ్చినంత మందిని బైక్‌పై తీసుకెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని కామెంట్ పోస్ట్ చేశాడు.
బైక్‌పై అరడజను మంది..
బైక్‌పై అరడజను మంది ప్రయాణించడమే కాదు ...బైక్‌పై కాళీ లేకుండా వాళ్లకు సంబంధించిన క్యారేజ్ బాక్సులు, స్కూల్ బ్యాగ్‌లను రెండు వైపుల తగిలించడంతో కనీసం పిల్లలు ఊపిరాడనంత ఇబ్బందికరంగా కూర్చున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. ఇలాంటి స్టంట్స్ చేస్తున్న వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే పిల్లలు ప్రమాదానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బైక్ నెంబర్ ఆధారంగా సిప్రీ బజార్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వెంటనే అతడ్ని పట్టుకొని జరిమానాతో పాటు శిక్ష కూడా విధించాలని కోరుతున్నారు.
పెట్రోల్ రేట్ పెంచితే ఇట్లనే ఉంటది..
మరికొందరు నెటిజన్లు ఈ వీడియో చూస్తే నువ్ సూపర్ రైడర్‌వి బాబు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరికొందరు పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెంచేస్తే బైకుల్ని కార్‌లుగా మార్చక ఏం చేస్తారంటూ సెటైర్‌లు వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending news, Uttar pradesh, Viral Video