హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

పది మందిలో ఆరుగురు ‘పోర్న్‌’కు బానిసలే.. మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి..

పది మందిలో ఆరుగురు ‘పోర్న్‌’కు బానిసలే.. మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి..

Porn Addiction: ‘ఎ స్టడీ ఆన్ ఇంటర్నెట్ అడిక్షన్ ఎమాంగ్ యంగ్ అడల్ట్స్ ఇన్ హైదరాబాద్’ పేరుతో 18-25 ఏళ్ల మధ్య యువతీ యువకులను సర్వే చేయగా తాము పోర్న్‌కు అడిక్ట్ కాలేదని యువతులు చెప్పారట. అదే, 57 శాతం మంది యువకులు తాము క్రమం తప్పకుండా పోర్న్ వీడియోలు చూస్తామని వెల్లడించారట.

ఇంకా చదవండి ...

    పోర్న్.. యువతలో చాలా మంది దీనికి బానిసలుగా మారిపోయారు. ఆ వీడియోలు చూడకపోతే ఉండలేం అన్నంతగా తయారైన వారూ ఉన్నారు. విచ్చలవిడిగా ఇంటర్నెట్ వాడకం, ఒంటరితనం వంటివి పోర్న్ వీడియోలు చూసేందుకు ప్రేరేపిస్తున్నాయి. ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పోర్న్ వీడియోల వాడకం తగ్గడం లేదు. ఎన్ని వెబ్‌సైట్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నా అవి ‘బైపాస్’ దారి తీసుకొని ప్రత్యక్షమవుతున్నాయి. ఆ వీడియోలను చూస్తూ యువత పెడదోవ పడుతున్నారు. అయితే, కొన్ని నెలల కిందట చేసిన సర్వేలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో సగం కంటే ఎక్కువ మంది కాలేజీ విద్యార్థులు పోర్న్‌కు బానిసలుగా మారిపోయారట. ‘ఎ స్టడీ ఆన్ ఇంటర్నెట్ అడిక్షన్ ఎమాంగ్ యంగ్ అడల్ట్స్ ఇన్ హైదరాబాద్’ పేరుతో 18-25 ఏళ్ల మధ్య యువతీ యువకులను సర్వే చేయగా తాము పోర్న్‌కు అడిక్ట్ కాలేదని యువతులు చెప్పారట. అదే, 57 శాతం మంది యువకులు తాము క్రమం తప్పకుండా పోర్న్ వీడియోలు చూస్తామని వెల్లడించారట.

    అయితే, పోర్న్ వ్యసనం నిరాశ, ఆత్రుత, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలకు కారణమవుతుందని తాజా సర్వే హెచ్చరించింది. ఈటింగ్ డిజార్జర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. పోర్న్ ఎక్కువగా చూడటం వల్ల భవిష్యత్తులో నిజంగా సెక్స్ చేసే సమయంలో అంగస్తంభన సమస్యలకు దారి తీస్తుందని వెల్లడించింది.

    First published:

    Tags: Porn Movies

    ఉత్తమ కథలు