Home /News /trending /

SIX LIONS FIGHTING FOR A SINGLE DEER ON A TREE SHOCKING THRILLING VIDEO WATCH HERE NK

Video: ఒక్క జింక కోసం 6 సింహాలు పోటీ.. చివరకు ఏమైందంటే!

ఒక్క జింక కోసం 6 సింహాలు పోటీ (image credit - twitter)

ఒక్క జింక కోసం 6 సింహాలు పోటీ (image credit - twitter)

Video: వాటి పోరాటం భూమిపై జరగలేదు. చెట్టుపై జరిగింది. ఆ జింకకు ఎదురైన నరకం... అలా ఇలా లేదు. ఈ వైల్డ్ లైఫ్ వీడియో కొంత థ్రిల్ కలిగిస్తోందని నెటిజన్లు చెబుతున్నారు.

    Video: సింహాలు ఎప్పుడూ గుంపులుగా తిరుగుతాయి. వేటాడినప్పుడు అన్నీ పోటీపడి తింటాయి. అలాంటి ఓ దృశ్యాన్ని టూరిస్టులు అత్యంత దగ్గర నుంచి చూశారు. అది మామూలు ఫైట్. అరుదైనది. ఎందుకంటే... ఒక్క జింక కోసం ఆరు సింహాలు పోటీ పడ్డాయి. అది భూమి మీద జరిగివుంటే... రొటీన్ ఫైట్ అయివుండేది. అది జరిగింది... ఓ చెట్టుపైన. ఆ టెన్షన్ తెప్పించే ఫైట్‌ని టూరిస్టులు కెమెరాల్లో బంధించారు. వైల్డ్ లైఫ్ సఫారీ వీడియోల్లో ఉండే థ్రిల్ ఇందులో కనిపిస్తోంది.

    ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సాకేత్ బదోలా... ఈ 45 సెకండ్ల వీడియోను ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ప్రారంభంలోనే 2 సింహాలు చెట్టుపై ఉండి... ఓ జింకను పట్టుకొని... దాని కోసం పోటీ పడుతున్నారు. వాటికి మరో నాలుగు సింహాలు తోడయ్యాయి. అవి కూడా చెట్టి ఎక్కి... వేలాడుతున్న జింకను లాక్కోవాలని ప్రయత్నించాయి. ఓ సింహానికి జింక పొట్ట దొరికింది. ఆ పొట్టను గట్టిగా పట్టుకునేందుకు అది ప్రయత్నించింది. మరో సింహం... జింకను కిందకు లాక్కునేందుకు ప్రయత్నించిన క్షణంలో... అన్ని సింహాలూ చెట్టు నుంచి కిందకు పడ్డాయి. కింద పడీ పడగానే... సింహాలన్నీ జింకపై పడి... చీల్డి చెండాడి తినేశాయి. ఇదంతా అక్కడికి వచ్చిన టూరిస్టులు చూస్తూనే ఉన్నారు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.


    ఆగస్ట్ 19న ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీన్ని చూసిన వాళ్లలో ఓ యూజర్ గ్రేట్ వీడియో అని మెచ్చుకోగా... మరొకరు అసలు జింకను చంపిన మొదటి సింహం ఏదని సరదాగా ప్రశ్నించారు. రోడ్డుపై పెట్రోల్ ట్యాంకర్ పడిపోతే... ఎలాగైతే... ప్రజలు పెట్రోల్ కోసం పోటీ పడతారో... ఇక్కడ సింహాలు జింక కోసం అలా పోటీ పడుతున్నాయని మరో మహిళా యూజర్ అభిప్రాయపడ్డారు.

    ఇది కూడా చదవండి: Video: పుచ్చకాయతో డోమినోస్ పిజ్జా... నెటిజన్ల రియాక్షన్ ఇదీ.!

    ఇంతకీ ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియలేదు. ఆ గడ్డి మైదానాలను బట్టీ... అది ఆఫ్రికా సఫారీలో వీడియో కావచ్చని భావిస్తున్నారు. గత నెలలో... సఫారీలో... ఓ సింహం... టూరిస్టుల వెంట పడింది. అది అలా చేస్తుందని ఊహించని టూరిస్టులు చాలా టెన్షన్ పడ్డారు. సఫారీలోకి వెళ్లొచ్చుగానీ... క్రూర మృగాలతో జాగ్రత్తగా ఉండాలి. మరీ దగ్గరకు వెళ్తే... అవి ఎందుకు ఊరుకుంటాయి అంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Viral, VIRAL NEWS, Viral Video, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు