హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Intresting Crime: ఓ డొక్కు చెంచా అధికారులకు నిద్ర లేకుండా చేసింది.. ఖైదీలకు వరంగా మారింది.. వీడియో వైరల్..

Intresting Crime: ఓ డొక్కు చెంచా అధికారులకు నిద్ర లేకుండా చేసింది.. ఖైదీలకు వరంగా మారింది.. వీడియో వైరల్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News: ఆ జైలు అత్యంత భద్రత కలిగినది. అక్కడ ఏ మాత్రం చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. కానీ ఇక్కడ జరిగిన ఓ ఘటన.. అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. అది కూడా ఖైదీలు చేసిన పనికి ఇలా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇంతకు ఏం జరిగిదంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్తి తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

టెక్నాలజీ (Technology) రోజురోజుకూ దూసుకుపోతోంది . ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి మానవుడు అడుగు పెడుతున్నాడంటేనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ టెక్నాలజీని కొందరు మంచికి ఉపయోగిస్తుంటే.. మరికొందరు చెడుకుఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నేరం చేసి కొందరు జైలుకు వెళ్తే.. అందులో నుంచి కూడా ఎలా తప్పించుకోవాలనే ఆలోచనలు చేస్తుంటారు. అలాంటిదే ఇక్కడ ఒక ఘటన జరిగింది. ఇది ఇజ్రాయెల్‌(Israil) దేశంలో చోటుచేసుకుంది. ఇది అక్కడ అత్యంత భద్రత కలిగిన జైలు. అందులో ఏమాంత్రం అధికారులకు అనుమానం వచ్చినా.. అప్రమత్తం అవుతుంటారు. చీమ చిటుక్కుమ‌న్నా అక్క‌డి అధికారుల‌కు తెలిసిపోతుంది. అలాంటి జైలు నుంచి ఆరుగురు పాల‌స్తీనా ఖైదీలు పారిపోయారు. అది ఎలా అంటే.. అప్పట్లో తెలుగు సినిమాల్లో జరిగినట్లు.. చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి.. జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సీన్లు చూసే ఉంటాం.

అది సినిమాలో కాబట్టి చూసే వాళ్లకు .. ఒక ఫీల్ తీసుకురావడానికి చేసి ఉంటారు. కానీ ఇలా జైలు లో నిజంగానే జరిగింది. ఇజ్రాయిల్ జైలులో కొందరు ఖైదీలు జైలు నుంచి పారిపోవడానికి చెంచా సహాయంతో సొరంగం తవ్వి మరీ తప్పించుకొని పారిపోయారు. ఇది వినడానికి వింతగా.. ఉన్నా నిజంగానే జరిగింది. ప్రస్తుతం ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇజ్రాయెల్‌లో ఉన్న గిల్బోవా అనే జైలు అత్యంత భద్రతా ప్రమాణాలు ఉండే జైలు. ఈ జైల్‌లోని ఓ సెల్‌లోనే ఇస్లామిక్‌ జిహాద్‌కు చెందిన ఐదురురితో పాటు అల్‌ అక్సా మార్టిర్స్‌ బ్రిగేడ్‌ నాయకుడు గత కొన్నేళ్లుగా శిక్షను అనుభవిస్తున్నారు.

వీరిలో నలుగురు జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. పాలస్తీనాకు చెందిన వీరంతా జైల్‌ నుంచి తప్పించుకోవడానికి పక్కా ప్లాన్‌ వేశారు. ఆ సెల్ లో ఉన్న ఓ సింక్ ను ఆధారం చేసుకొని.. ఓ తుప్పు పట్టిన చెంచాను సొరంగం తవ్వారు. ఆ సొరంగం బయట ఉండే ఖాళీ ప్రదేశం వరకు తవ్వి.. ఆరుగురు ఖైదీలు ధర్జాగా అక్కడ నుంచి పారిపోయారు. ఇప్పుడా ఖైదీల కోసం ఇజ్రాయెల్ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించారు. సాధార‌ణంగా ఇజ్రాయెల్ జైలు నుంచి పాల‌స్తీనా ఖైదీలు పారిపోవ‌డం అంత సులువు కాదు.

Video: దేవుడా!.. కిడ్నీ అమ్ముకొని భార్యకు ఐఫోన్ కొన్నాడు!

అత్యంత అరుదుగా ఇలాంటివి జ‌రుగుతుంటాయి. ఈ ఘ‌ట‌న‌పై ఇజ్రాయెల్ ప్ర‌ధాని న‌ఫ్తాలీ బెనెట్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. వాళ్లు జైలు గది డిజైన్ లో ఉన్న ఉన్న లొసుగుల‌ను వాళ్లు త‌మ‌కు అనుకూలంగా మార్చుకొని ఈ సొరంగం త‌వ్విన‌ట్లు ఇజ్రాయెల్ జైళ్ల శాఖ క‌మిష‌న‌ర్ కేటీ పెర్రీ వెల్ల‌డించారు. జైలు గోడ‌ల వెనుక ఉన్న ఖాళీ ప్ర‌దేశం ఈ ఖైదీల‌కు ఉప‌యోగ‌ప‌డింది. వాళ్లు చాలా ప‌క్కాగా ప్లాన్ చేసి ఈ ప‌ని చేశార‌ని, బ‌య‌టి వాళ్ల స‌హ‌కారం కూడా ఇందులో ఉండొచ్చ‌ని జైలు అధికారులు చెప్పారు. జైల్‌ నుంచి బయటపడ్డ వారు పంట పొలాల నుంచి పరిగెడుతూ పారిపోయారని స్థానిక రైతులు చెబుతున్నారు.

Divorced Couple Remarriage: విడాకులు తీసుకున్న భార్యాభర్తలకు .. హైకోర్టు జోక్యంతో మళ్లీ పెళ్లి.. పూర్తి వివరాలు ఇలా..

ఈ ఘ‌ట‌న త‌ర్వాత జైల్లోని మిగ‌తా 400 మంది ఖైదీల‌ను మ‌రో జైలుకు త‌ర‌లించారు. జైలు నుంచి త‌ప్పించుకున్న ఖైదీలు.. ఇప్ప‌టికే పాల‌స్తీనీయుల‌కు ఎంతో కొంత ప‌ట్టు ఉన్న జెనిన్ వైపు వెళ్తున్న‌ట్లు గుర్తించారు. ఓ చెంచాతో కొన్ని నెల‌ల పాటు శ్ర‌మించి వాళ్లు ఈ సొరంగం తవ్విన‌ట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్ల‌డించింది.

ఆ తుప్పు ప‌ట్టిన చెంచా ఎవ‌రికీ క‌నిపించ‌కుండా.. జైలు గ‌దిలోని ఓ ఫొటో వెనుక దాచారు. పారిపోయిన వాళ్ల‌లో న‌లుగురు ఖైదీలు జీవిత‌ఖైదు శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. ఖైదీలు జైలులో తవ్విన సొరంగాన్ని సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఈ వీడియో చూసి వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

First published:

Tags: Crime news, Israel, Trending news

ఉత్తమ కథలు