Snake: బాబోయ్.. ఆరడుగుల నల్ల తాచు.. రాత్రి తొమ్మిదింటికి ఇంట్లోకి దూరింది.. చివరకు..

ఇంట్లో పడగ విప్పి చూస్తున్న పాము, ఇంటి బయట కుటుంబ సభ్యులు

వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా పాములు పుట్టల నుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నేరుగా ఇళ్లలోకి దూరి అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇంట్లో నిద్రిస్తున్న వారిని కాటేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. రాజస్థాన్‌లోని కోట జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

  • Share this:
    కోట: వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా పాములు పుట్టల నుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నేరుగా ఇళ్లలోకి దూరి అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇంట్లో నిద్రిస్తున్న వారిని కాటేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. రాజస్థాన్‌లోని కోట జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. కైతూన్ పట్టణ పరిధిలోని గొడ్ల్యహేడి గ్రామంలో ఓ ఇంట్లోకి ఆరడుగుల నాగుపాము దూరి అందరినీ భయాందోళనలకు గురిచేసింది. నిద్రించే రూంకు, వంటగదికి మధ్య ఓ బైక్ నిలిపి ఉంచగా.. ఆ బైక్ పక్కన నిల్చుని నట్టింట్లో తిరుగుతూ ఇంట్లో వాళ్లను బెంబేలెత్తించింది. పామును చూసి ఎక్కడి వాళ్లు అక్కడ తప్పించుకునేందుకు పరుగులు తీశారు. ఇంట్లో చిన్నారులు వెనక పక్క ఉన్న గోడ ఎక్కి తప్పించుకున్నారు.

    ఆ పాము మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా నట్టింట్లో పడగ విప్పి మరీ బుసలు కొడుతూ దాదాపు రెండు గంటల పాటు అందరినీ హడలెత్తించింది. గ్రామానికి చెందిన వన్యప్రాణి ప్రేమికుడు గోవింద్ శర్మకు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఆయన స్పాట్‌కు చేరుకుని పామును పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలేశారు. అయితే.. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోకి పాము దూరడంతో కుటుంబ సభ్యులు భయంతో వణికిపోయారు. అందరూ ఇంట్లో నుంచి ఎలాగోలా బయటపడ్డారు. అదే పాము రాత్రి నిద్రించిన సమయంలో ఇంట్లో దూరి ఉంటే జరగరాని నష్టం జరిగేది.

    ఇది కూడా చదవండి: Shocking Incident: ఏం మనుషులో.. పాముకు కరెంట్ షాక్ ఇచ్చి చంపబోయారు.. అసలేం జరిగిందంటే...

    ఇలా ఇళ్లలోకి పాములు రావడంపై ప్రకృతి ప్రేమికుడు గోవింద్ శర్మ స్పందిస్తూ.. అడవులను నాశనం చేసి నిర్మాణాలు ఏర్పరచుకోవడం, పొలాలకు దగ్గర్లో ఇళ్లు ఉండటం కూడా ఇలా పాములు వచ్చేందుకు కారణమవుతుందని చెప్పారు. అంతేకాకుండా.. వర్షాకాలంలో బాగా వర్షాలు కురిసిన సందర్భంలో.. ఎండాకాలంలో ఎండలు తట్టుకోలేక కూడా పాములు ఇలా పుట్టల నుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి వస్తుంటాయని తెలిపారు. పాములకు ఎలుకలు తినడం అంటే ఎంతో ఇష్టమని, వాటి ఆహార అన్వేషణలో భాగంగా ఇలా జనావాసాల్లోకి వస్తుంటాయని చెప్పారు. నాగు పాములు బుసలు కొడుతూ.. శబ్దం చేస్తూ వేటను సాగిస్తే.. క్రైట్ స్నేక్ మాత్రం సైలెంట్‌గా అటాక్ చేస్తుందన్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: