గవర్నమెంటు ఆఫీసుల్లో కాలు మీద కాలేసుకొని కూర్చోవడం తప్పు కాదట..

Trending News: మీరెప్పుడైనా ప్రభుత్వ అధికారులు, పోలీసులను కలిసిన సందర్భంలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారా? అలా కూర్చుంటే అలా కూర్చోవద్దని ఆదేశాలు జారీ చేశారా? అయితే, మీరు ఆ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చోవచ్చు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 30, 2019, 12:58 PM IST
గవర్నమెంటు ఆఫీసుల్లో కాలు మీద కాలేసుకొని కూర్చోవడం తప్పు కాదట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎవరైనా కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఎంత పొగరు.. కాస్త మర్యాద కూడా లేదా? అని కొందరు అనుకుంటారు. పెద్దలు గానీ, ఉన్నతాధికారులు కలిసినపుడు కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేయరు. అయితే.. మీరెప్పుడైనా ప్రభుత్వ అధికారులు, పోలీసులను కలిసిన సందర్భంలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారా? అలా కూర్చుంటే అలా కూర్చోవద్దని ఆదేశాలు జారీ చేశారా? అయితే, మీరు ఆ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చోవచ్చు. ఎందుకంటే అలా కూర్చోవద్దని చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు. అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా.. కర్ణాటకకు చెందిన నారాయణ మూర్తి అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో కాలు మీద కాలేసుకొని కూర్చోవడం ప్రభుత్వ ఆదేశమా? అని ఆర్టీఐ ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరారు. దీనికి సమాధానంగా ‘అలాంటిదేమీ లేదని.. ఎలాంటి ఆదేశం గానీ, నోటిఫికేషన్ గానీ, ప్రచారం గానీ, గైడ్‌లైన్స్ గానీ లేవని’ సీఎస్ కార్యాలయం స్పష్టం చేసింది.

వాస్తవానికి ఏం జరిగిందంటే.. నారాయణ మూర్తి, లాయరైన ఆయన స్నేహితురాలు సుధ ఓ కేసు నిమిత్తం బెంగళూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఉన్నతాధికారి లేకపోవడంతో అక్కడే కూర్చున్నారు. రెండు గంటల పాటు అదేపనిగా ఒకే ఆసనంలో కూర్చోవడానికి సుధ ఇబ్బంది పడ్డారు. దీంతో కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. అక్కడే ఉన్న కానిస్టేబుళ్లు వచ్చి అలా కూర్చోవద్దని చెప్పారు. దీంతో తాము హతాశులమయ్యామని, దీనిపై అభ్యంతరం కూడా వ్యక్తం చేశామని మూర్తి వెల్లడించారు. వెంటనే తాను ఆర్టీఐ ద్వారా వివరణ కోరానని ఆయన స్పష్టం చేశారు.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>