#2020TipChallenege : రెస్టారెంట్ సర్వర్‌కి రూ.1.44 లక్షల టిప్... ఆ పుణ్యాత్ముడు ఎవరంటే...

#2020tipchallenege : జనరల్‌గా రెస్టారెంట్లకి వెళ్లేవారు... బిల్లులో మిగిలిన చిల్లరను టిప్‌గా ఇస్తుంటారు. మరి ఈ ఘటనలో ఏమైంది? అంత టిప్ ఇచ్చిందెవరు? ఎందుకు?

news18-telugu
Updated: January 4, 2020, 12:50 PM IST
#2020TipChallenege : రెస్టారెంట్ సర్వర్‌కి రూ.1.44 లక్షల టిప్... ఆ పుణ్యాత్ముడు ఎవరంటే...
రెస్టారెంట్ సర్వర్‌కి రూ.1.44 లక్షల టిప్ (credit - insta - donniewahlberg)(credit - twitter - Jenny McC-Wahlberg @JennyMcCarthy)
  • Share this:
#2020TipChallenege : సింగర్, నటుడైన డోన్నీ వాల్బెర్గ్‌ను సోషల్ మీడియాలో తెగ మెచ్చేసుకుంటున్నారు. ఎందుకంటే... ఈ ఇల్లినాయిస్ హీరో... ఓ రెస్టారెంట్‌కి వెళ్లి... సర్వర్‌కి టిప్ కింద... $2020 (రూ.1.44లక్షలు) ఇచ్చాడు. నటుడు మార్క్ వాల్బెర్గ్‌కి తమ్ముడైన డోన్నీ... తనకు ఫుడ్ సెర్వ్ చేసిన మహిళా సర్వర్ బెథానీకి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విషెస్ చెప్పాడు. 2020 టిప్ ఛాలెంజ్‌ కింద... అంత టిప్ ఇచ్చాడు. నిజానికి ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. కానీ... డోన్నీ భార్య జెన్నీ మెక్‌కార్తీ... ఆ బిల్లును షేర్ చెయ్యడంతో ఆ విషయం ప్రపంచానికి తెలిసింది. IHOP ఔట్‌లెట్‌కి వెళ్లిన డోన్నీకి... బిల్లు $78 వచ్చింది. అతను టిప్ ఇవ్వాలనుకుంటే... రౌండప్‌గా 22 డాలర్లు ఇవ్వొచ్చు. కానీ మంచి మనసున్న డోన్నీ... ఏకంగా అంత టిప్ ఇవ్వడంపై అతని భార్య జెన్నీ మెక్‌కార్తీ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తన భర్త అద్భుతమైన వ్యక్తి అని పొగడ్తలతో ముంచేసింది.


ఇంత మంచి పని చేశాక... సోషల్ మీడియా సైలెంట్‌గా ఎందుకుంటుంది. నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.





ఇక్కడ మనం మరో విషయం కూడా మాట్లాడుకోవాలి. ఇటీవల మిజిగాన్‌లో కూడా... ఓ సర్వర్‌... $2020 (రూ.1.44లక్షలు) టిప్ కింద పొందారు. ఐతే... టిప్ ఎవరు ఇచ్చిందీ బయటపెట్టవద్దని కోరడంతో... ఆ పుణ్యాత్ముడు/పుణ్యాత్మురాలు ఎవరో తెలియలేదు.
Published by: Krishna Kumar N
First published: January 4, 2020, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading