సింగర్ గీతా మాధురి కూతురి పేరేంటో తెలుసా..

Geetha Madhuri | గీతామాధురి, నందు దంపతులు తమ కూతురికి దాక్షాయణి ప్రకృతి అని పేరు పెట్టారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ పాపతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది గీతామాధురి.

news18-telugu
Updated: October 19, 2019, 8:26 PM IST
సింగర్ గీతా మాధురి కూతురి పేరేంటో తెలుసా..
కూతురు దాక్షాయణి ప్రకృతితో గీతా మాధురి, నందు దంపతులు
  • Share this:
తెలుగు చలనచిత్ర సీమలో తన పాటలతో యావత్తు తెలుగు ప్రజానీకాన్ని మైమరిపిస్తున్న గాయని గీతా మాధురి. 2014 ఫిబ్రవరి 9న నటుడు నందును పెళ్లి చేసుకొని సంసార బంధంలోకి అడుగుపెట్టిన ఈమె బిగ్‌బాస్ 2లో మెరిసింది. తన చాకచక్యంతో అందరి మన్నలను పొంది.. షో రన్నరప్ కూడా నిలిచింది. ఆ షో ముగిశాక గీతామాధురి దంపతులు పిల్లల కోసం ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఈ మధ్యే వీరికి పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఈ నెల 9న గీతా పండంటి ఆడబిడ్డకు జన్మించింది. ఇదే విషయాన్ని ఆమె భర్త నందు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తల్లీ, బిడ్డ.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని.. అందరికీ ధన్యవాదాలు అంటూ నందు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.


కాగా, ఆ బిడ్డకు గీతామాధురి దంపతులు దాక్షాయణి ప్రకృతి అని పేరు పెట్టారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ పాపతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది గీతామాధురి. అంతేకాకుండా.. తమ బిడ్డకు సంబంధించి పలు ఫోటోలను పోస్ట్ చేసింది.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading