హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మార్కెట్లోకి రెండు వెరైటీ నెయిల్ పాలిష్ లు.. స్త్రీల పిరియడ్స్ సమయంలో విడుదలయ్యే రక్తం రంగులో..

మార్కెట్లోకి రెండు వెరైటీ నెయిల్ పాలిష్ లు.. స్త్రీల పిరియడ్స్ సమయంలో విడుదలయ్యే రక్తం రంగులో..

నెయిల్ డెక్ కంపెనీ విడుదల చేసిన కొత్త బ్రాండ్లు

నెయిల్ డెక్ కంపెనీ విడుదల చేసిన కొత్త బ్రాండ్లు

డే టు బ్లడ్ (DAY 2 BLOOD), డే ఆఫ్ బ్లడ్ (DAY OFF BLOOD) అనే రెండు నెయిల్ పాలిష్ వెరైటీలను నెయిల్ డెక్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్కో బాటిల్ 19 డాలర్లు కాగా, రెండు రకాల బ్రాండ్లు ఉండే బండిల్ ధర 36 డాలర్ల రూపాయలు. వీటిల్లో విచిత్రం ఏంటంటారా..?

ఇంకా చదవండి ...

  అచ్చ తెలుగులో నెలసరి, ఇంగ్లీషులో పిరియడ్స్. పదం ఏదైనా సరే, ఇప్పటికీ మెజారిటీ చోట్ల పిరియడ్స్ వచ్చిన మహిళలను అదో రకంగా చూస్తుంటారు. కొన్ని చోట్ల అయితే వంటింట్లోకి అడుగుపెట్టనివ్వరు. ఇంట్లో కూడా అన్ని వస్తువులను ముట్టుకోనివ్వరు. ఆ మూడు రోజులు కడుపు నొప్పి, వెన్ను నొప్పి వంటి బాధలతో స్త్రీలు చిత్రవధను అనుభవిస్తుంటారు. స్త్రీల లో దుస్తులపై రక్తపు మరకలను చూసి నవ్వే వాళ్లున్న సమాజంలోనే, ఆ రక్తపు మరకల వెనుకున్న బాధను, స్త్రీల గొప్పతనాన్ని గుర్తెరిగిన పురుషులు కూడా ఉన్నారు. ఆ కోవలోకే సింగపూర్ కు చెందిన నెయిల్ డెక్ వ్యవస్థాపకుడు దర్యాల్ చ్యూ వస్తారు. ఇతడి గొప్పతనమేంటనే కదా మీ డౌటు. అతడి కంపెనీ పేరు వింటేనే తెలుస్తోంది కదా, అతడో నెయిల్ పాలిష్ ఉత్పత్తుల కంపెనీకి యజమాని అని. ఓ నెయిల్ పాలిష్ యజమానికి, పైన చెప్పుకున్న పదాలకు సంబంధమేంటనే కదా మీ అనుమానం. అక్కడికే వెళ్దాం.

  డే టు బ్లడ్ (DAY 2 BLOOD), డే ఆఫ్ బ్లడ్ (DAY OFF BLOOD) అనే రెండు నెయిల్ పాలిష్ వెరైటీలను నెయిల్ డెక్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. పిరియడ్స్ సమయంలో స్త్రీలు రక్తాన్ని కూడా కోల్పోతుంటారు కదా. ఆ రక్తం ఏ రంగులో ఉంటుందో, అచ్చం అదే రంగులో ఉండే నెయిల్ పాలిష్ లను నెయిల్ డెక్ తీసుకొచ్చింది. ఒక్కో బాటిల్ 19 డాలర్లు కాగా, రెండు రకాల బ్రాండ్లు ఉండే బండిల్ ధర 36 డాలర్ల రూపాయలు. పిరియడ్స్ ప్రొడక్స్ట్ కంపెనీగా పేరు సంపాదించిన ఈ కంపెనీ.. తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ నెయిల్ పాలిష్ బ్రాండ్లకు సంబంధించిన ఫొటోలను పెట్టగానే, నెట్టింట పెద్ద చర్చే జరిగింది. ఈ బ్రాండ్ల ఫొటోలను పెడుతూ, ఆ కంపెనీ యజమాని చేసిన కామెంట్స్ పై కూడా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


  ’మీలో చాలా మందికి తెలుసు నేను పురుషుడినేనని. మహిళలు పిరియడ్స్ సమయంలో పడే బాధను నేను కూడా స్వయంగా అనుభవించానని నేను చెప్పను. కానీ నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు పడిన బాధను నేను కళ్లారా చూశాను. పిరియడ్స్ సమయంలో నా చెల్లి పడ్డ వేదనను చూశాను. పిరియడ్స్ వచ్చిన ఆ మూడు రోజుల పాటు నా చెల్లి స్కూల్ కు రాకపోయేది. ఆ రోజుల్లో వచ్చే నొప్పిని భరించలేక ఏడ్చేది. నా భార్య గర్భవతి అయింది కాబట్టి, తొమ్మిది నెలల పాటు పిరియడ్స్ బాధల నుంచి దూరంగా ఉంది. గత పదేళ్లుగా మీ అభిరుచులకు తగ్గట్టుగానే నెయిల్ పాలిష్ బ్రాండ్లను అందించాం. ఇప్పుడు తాజాగా మార్కెట్లోకి తెస్తున్న డే టు బ్లడ్, డే ఆఫ్ బ్లడ్ బ్రాండు, పిరియడ్ రోజులకు, మామూలు రోజులకు మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చుతుందని భావిస్తున్నా.‘ అని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. ఆయన చెప్పిన మాటలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Ayurveda health, Health benefits

  ఉత్తమ కథలు