కియారా అద్వానీ , సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన 'షేర్షా' సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు అంతకంటె ఎక్కవ పాపులర్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో నెటిజన్లు చాలా రీల్స్(Reels) చేశారు. ఇంకా చేస్తున్నారు కూడా. 'రంజా' , 'రతన్ లంబియా' పాటలు పిల్లలు, వృద్ధులు, మహిళలు(Womens) అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. ఇప్పటికీ ఈ సాంగ్స్ ను తమ మొబైల్స్ లో కూడా వింటూ ఉంటారు. తాజాగా టాంజానియాకు చెందిన ఓ సోదరుడు, సోదరికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ (Internet) లో హల్ చల్ చేస్తోంది. అందులో ఏముందంటే.. తూర్పు ఆఫ్రికా కంటెంట్ సృష్టికర్త కైలీ పాల్ మరియు ఆమె సోదరి నీమా సాంప్రదాయ మాసాయి దుస్తులలో 'రాటా లంబియా' పాటకు లిప్‌సింక్ చేస్తూ కనిపించారు.
Begin your week with this beautiful video. Simply adorable ? pic.twitter.com/NNG1K5rY5D
— Arun Bothra ?? (@arunbothra) November 29, 2021
ఈ జంట హిందీ పాటను ఇంత అందంగా అలరిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అందుకేనేమో అతనికి ఇంటర్నెట్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ వీడియోను ఐపీఎస్ అరుణ్ బోత్రా తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. 'ఈ అందమైన వీడియోతో మీ వారాన్ని ప్రారంభించండి' అని రాశారు. ఈ వార్త రాసే వరకు ఈ వీడియోకి 44 వేలకు పైగా వ్యూస్, మూడు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు.. నిజంగా, సంగీతం ఒక అందమైన భాష అని.. ఆ పాటకు అతడు ఇస్తున్న ఎక్స్ ప్రెషన్స్ అద్భుతం అంటూ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ వాళ్లను చూస్తుంన్నంత సేపు మనసుకు ప్రశాంతంగా ఉందంటూ మరొకరు కామెంట్ చేశారు.
Begin your week with this beautiful video. Simply adorable ? pic.twitter.com/NNG1K5rY5D
— Arun Bothra ?? (@arunbothra) November 29, 2021
ఈ టాంజానియా జంట ప్రతీ ఒక్కరికీ తెగ నచ్చేసింది. వీరు చేసిన లిప్ సింక్ కు ఈ పాట పాడిన జుబిన్ నౌటియాల్ కూడా తన ట్విట్టర్ లో పోస్టు చేయగా.. నటి కియారా అద్వానీ దానిని ట్విట్టర్‌లో రీట్వీట్ చేసింది. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా తన ఇన్‌స్టా స్టోరీలో దానిని మళ్లీ పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్లు రీ ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
షేర్షా 2021లో విడుదలైన హిందీ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్, అజయ్ షా, హిమాన్షు గాంధీ నిర్మించిన ఈ సినిమాకు విష్ణువర్థన్ దర్శకత్వం వహించాడు. దీనిని 12 ఆగష్టు 2021న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు.ఈ సినిమా పరమ్ వీర్ చక్ర అవార్డు పొందిన కెప్టెన్ విక్రమ్ భాత్రా జీవిత కథ ఆధారంగా నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Instagram post, VIRAL NEWS