SHOP OWNER ACID ATTACK ON CUSTOMER FOR ASKING FOR LOAN IN UP NEWS GOES VIRAL SNR
2రూపాయలు అప్పు అడిగితే అమ్మాయిపై యాసిడ్ దాడి..వామ్మో అంత పని చేశారా..
Photo Credit: Youtube
OMG: ఆగ్రాలో ఓ యువతి కిరాణ షాపులో రెండు రూపాయల అప్పు ఇవ్వమని కోరింది. అయితే ఈవిషయంలో షాపు యజమాని కుదరదని చెప్పడంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.ఈఘటనలో షాప్ ఓనర్ అప్పు అడిగిన 18ఏళ్ల యువతిపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన వైరల్ అవుతోంది.
ఎక్కడైనా కిరాణ షాపులో కస్టమర్ అప్పు ఇవ్వమని అడిగితే యజమాని లేదంటారు. కుదిరితే అప్పు ఇస్తారు. అరువు పెట్టమని అడిగిన వినియోగదారుడిపై యాసిడ్ పోస్తారా చెప్పండి. ఉత్తరప్రదేశ్(Uttar pradesh)లో ఎలాంటి ఘటన జరగడం అందర్ని షాక్‌కి గురి చేసింది. ఆగ్రా(Agra)లోని షాహ్గంజ్ (Shahganj)ప్రాంతంలోని సరైఖ్వాజ ఏరియాలో ఈఘటన జరిగింది. 18సంవత్సవరాల యువతి కేవలం 2రూపాయల టూత్ పేస్ట్ అప్పుగా ఇవ్వమని స్థానికంగా ఉన్న కిరాణషాపు (Grocery store)ఓనర్ని కోరింది. కేవలం రెండు రూపాయల టూత్ పేస్ట్ (2Rupees toothpaste)దగ్గర మొదలైన గొడవ తారాస్థాయికి చేరింది. షాపు ఓనర్ అప్పు ఇవ్వకపోగా కోపోద్రేకురాలిగా మారిపోయి యువతి ముఖంపై యాసిడ్ పోసింది. అయితే ఆ సమయంలో కస్టమర్‌గా వచ్చిన యువతి పక్కకు జరగడంతో యాసిడ్ కొంత ముఖంపై, కొంత గోడపై పడింది. షాపు యజమానికి యాసిడ్ దాడి(Acid attack)లో యువతి గాయపడిన విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఘటన స్తలానికి చేరుకున్నారు. షాపు యజమానిరాలిని తిట్టిపోస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కిరాణ షాపు యజమాని దుకాణం వదిలి పారిపోయింది. విషయం ఆ ప్రాంతంలో అందరికి తెలియడంతో అంతా షాపు దగ్గరకు వచ్చి గూమికూడారు. కొందరు కిరాణషాపు యజమానిని తప్పుపడుతుంటే ..మరికొందరు బాధితురాలి బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం రెండు రూపాయల అప్పు దగ్గర ఇంత ఘర్షణ జరగడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
అప్పు అడిగినందుకు యాసిడ్‌తో దాడి..
యువతిపై జరిగిన యాసిడ్ దాడితో ఆగ్రహంగా ఉన్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పు ఇవ్వమని కోరితే ఇలాగే యాసిడ్‌తో దాడి చేస్తారా అంటూ పోలీసులకు తమ గోడు వెళ్లబోసుకోవడంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. కిరాణ షాపు యజమానిని విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పి పంపించారు.
యూపీలో కిరాణషాపు యజమాని దౌర్జన్యం..
కేవలం రెండు రూపాయల అప్పు కోసం జరిగిన గొడవ..పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం చూసిన స్థానికులు నివ్వెరపోయారు. అప్పు ఇస్తే ఇంత గొడవే వచ్చేది కాదు కదా అని కొందరూ..అరువు ఇవ్వడం లేదని మర్యాదగా చెబితే విషయం ఇంత పెద్దది అయ్యేది కాదు కదా అని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఈ తతంగం అంతా సోషల్ మీడియాలో చూసిన జనం అయితే ఇద్దరి మధ్య పాత గొడవలు ఏవైనా ఉండి ఉంటాయి అందుకే ఇలా ఘర్షణ పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు గొడవ రెండు రూపాయల అప్పు కోసమే జరిగిందా లేక ఇంకా ఏమైనా పాత గొడవలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.