Home /News /trending /

అర్ధనగ్నంగా ఉండి మరీ ఓ యువతి పాడు పని.. ఇంటి డోర్ కు అమర్చిన సీక్రెట్ కెమెరాతో బయటపడిన బండారం..!

అర్ధనగ్నంగా ఉండి మరీ ఓ యువతి పాడు పని.. ఇంటి డోర్ కు అమర్చిన సీక్రెట్ కెమెరాతో బయటపడిన బండారం..!

దొంగతనం చేస్తున్న యువతి

దొంగతనం చేస్తున్న యువతి

ఏదైనా వస్తువు ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే.. డెలివరీ చేసే అబ్బాయి మన ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ చేసి చేతికి ఇచ్చి వెళ్లిపోతాడు. ఒకవేళ ఆ సమయంలో మనం ఇంట్లో లేకపోతే పక్కింటి వాళ్లనో.. ఎదురింటి వాళ్లనో ఆ పార్సిల్ తీసుకోమనడం పరిపాటి. అయితే..

ఇంకా చదవండి ...
సాధారణంగా మనం ఏదైనా వస్తువు ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే.. డెలివరీ చేసే అబ్బాయి మన ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ చేసి చేతికి ఇచ్చి వెళ్లిపోతాడు. ఒకవేళ ఆ సమయంలో మనం ఇంట్లో లేకపోతే పక్కింటి వాళ్లనో.. ఎదురింటి వాళ్లనో ఆ పార్సిల్ తీసుకోమనడం.. వారి దగ్గరి నుంచి సాయంత్రం తీసుకోవడం మనకు కామన్ గా జరిగేదే. అయితే అమెరికాలో అలా కాదు.. ఒకవేళ డెలివరీ చేసే సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నా లేకపోయినా ఇంటి ముందు పెట్టి వెళ్లిపోతారట. ఆర్డర్ వచ్చిందని ఆ తర్వాత చెక్ చేసుకొని మనం తీసుకోవాలి అంతే. అయితే ఈలోపే చాలామంది ఇంటి ముందున్న పార్శిళ్లను దొంగలు మాయం చేసేయడం ఈ మధ్య ఆ దేశంలో కామన్ గా మారిపోయిందట. దీన్ని ఫ్రంట్ పోర్చ్ ప్యాకేజింగ్ థెఫ్ట్ అని పిలుస్తున్నారు అక్కడి పోలీసులు.

అంటే ఇంటి ముందు ఉన్న ప్యాకేజీలు దొంగిలించడం అన్నమాట. సరిగ్గా ఇలాంటి దొంగతనమే అమెరికాకి చెందిన ఓ మహిళ ఇంటి ముందు కూడా జరిగింది. అయితే ఆమె అంతకుముందే తన గుమ్మానికి ముందు సెక్యూరిటీ కెమెరా అమర్చడం వల్ల ఆ దొంగతనం గురించి బయటపడింది. దొంగ ముఖం వీడియోలో క్లియర్ గా కనిపించింది. ఇంకేముంది? పోలీసులు ఆ దొంగ కోసం వెతుకులాటలో ఉన్నారు. అసలేం జరిగిందంటే..అమెరికాలోని ఓ ఇంటి ఓనర్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసింది. ఆ వస్తువును డెలివరీ ఏజెంట్ ఇంటి ముందు వదిలి వెళ్లాడు. వదిలి వెళ్లిన కొన్ని నిమిషాలకే వేగంగా పరిగెడుతూ ఓ అమ్మాయి వచ్చి ఆ ప్యాకెట్ ని పట్టుకొని వెళ్లిపోయింది. ఆమె ఎంత స్ట్రాంగ్‌గా ఈ దొంగ‌త‌నాన్ని చేయాల‌ని సంక‌ల్పించుకుందో ఈ వీడియో చూస్తే అర్థమ‌వుతుంది. అందులో ఆమె ప్యాకెట్‌ని దొంగిలించ‌డానికి స్పీడ్‌గా వ‌స్తున్నప్పుడు తాను వెసుకున్న టాప్ జారిపోయి, అర్థన‌గ్నంగా మారినా ప‌ట్టించుకోలేదు. జారిన టాప్ సంగ‌తి ప‌ట్టించుకోకుండా అక్క‌డున్న ప్యాకెట్‌ని తీసుకొని ప‌రిగెత్తే ప‌నిలోనే మునిగిపోయింది. అందులోనూ, ఆ దొంగ చెప్పులు కూడా వేసుకోలేదు గ‌నుక ఆవిడెవ‌రో పొరిగింటావిడేన‌ని ట్విట్ట‌ర్‌ లో ఈ వీడియో చూసిన‌వారంతా అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

ఆ ప్యాకెట్ పోగొట్టుకున్న ఇంటి ఓన‌రు మెయిన్ డోరుకి కాలింగ్ బెల్‌లా ఉండే రింగ్‌లో సెక్యురిటీ కెమెరా (Security Camera) అమ‌ర్చుకోవ‌డం వ‌ల్ల ఈ విష‌యం అంతా బ‌య‌ట‌ప‌డింది. మొత్తానికి దొంగ‌త‌నం చేసిన ఈ యువ‌తి మొహం స్ప‌ష్టంగా క‌నిపించ‌డంతో దొంగ‌త‌నం చేసిందెవ‌రో ఈజీగా తెలుసుంటామ‌న్నారు పోలీసులు. `దొంగ‌ను త్వ‌ర‌లోనే క‌స్ట‌డీకి తీసుకుంటాము` అన్నారు హ్యారీ కౌంటీ ప్రిసింక్ట్ 1 కానిస్టేబుల్ అయిన అలెన్ రోజ్‌. అయితే ఈ దొంగ‌త‌నం చేసిన యువ‌తిపై క్రిమిన‌ల్ చార్జీ తీసుకుంటారో లేదోన‌న్న విషయంలో స్ప‌ష్ట‌త లేదు. ఎందుకంటే అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో దొంగ‌త‌నం చేసిన వ‌స్తువును బ‌ట్టి అది దొంగ‌త‌నం చేయ‌క ముందు క‌నీసం ఒక డాల‌ర్ లిమిట్ ఉంటుంది. అయితే త‌ర్వాత దొంగ‌త‌నం తీవ్ర‌త‌ను బ‌ట్టి తీర్పు ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

అయితే బ‌ట్ట‌లు జారిపోతున్నా ప‌ట్టించుకోకుండా దొంగ‌త‌నం చేసిన ఆ ప్యాకెట్‌లో నార్డ్‌స్టోర్మ్ నుంచి వ‌చ్చిన ఓ కొత్త డ్ర‌స్ ఉంది. ఏదేమైనా, ఎందుకంటే ఇటీవ‌ల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువ‌య్యింది. ఇలాంటి దొంగతనాలు కూడా ఎక్కువవుతున్నాయి. అంతేకాకుండా ఇలాంటి దొంగ‌త‌నాలు కూడా సెల‌వురోజుల్లోనే ఎక్కువ. సెలువుల్లోనే ఎక్కువ మంది షాపింగ్ చేస్తుండటంతో దొంగ‌త‌నాలు అప్పుడే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఈ వీడియో వైర‌ల్‌గా మారి, ఇంట‌ర్నెట్‌ లో చ‌క్క‌ర్లు కొట్టిన త‌ర్వాత డోర్‌బెల్ రింగ్ కెమెరాల సేల్ పెరుగుతాయంటున్నారు. ఇలా గుమ్మం ఎదురుగా ఉన్న‌వాటిని దొంగ‌త‌నం చేసే నేరాలు అధిక‌మ‌వుతున్న నేపథ్యంలో దొంగిలించిన వ‌స్తువు విలువ‌తో సంబంధం లేకుండా ఇలాంటివి నేరంగా, ఘోరంగా ప‌రిగ‌ణించ‌డం స‌బబే అని జార్జియా రాష్ట్రం నిర్ణయించింది. ఎందుకంటే, ఇలా దొంగ‌త‌నం చేస్తున్న‌వారికి బాధితులు ఎంత‌గా న‌ష్ట‌పోతున్నారో అర్ధం కావ‌ట్లేదు. అందుకే దీనిపై నిఘాతో పాటు, శిక్ష కూడా పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: నాకు పిల్లను వెతికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో.. అంటూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన 26 ఏళ్ల కుర్రాడు
First published:

Tags: Amazon, America, Crime news, Crime story, CYBER CRIME, Swiggy, Zomato

తదుపరి వార్తలు