• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • SHOCKING VISUALS IN CCTV FOOTAGE OF AN ACCIDENT IN GUJARAT SURAT BIKE RAN OVER CAR TIRES VIDEO GETTING VIRAL HSN

Viral Video: ప్రాణాలు దక్కినా చాలని బైక్ నుంచి కింద పడిపోయాడు.. కానీ మరుక్షణంలోనే ఆ కారు పల్టీలు కొట్టి..

కారును ఢీకొట్టిన బైక్

ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వేగంగా వస్తున్న కారు టైర్లను స్కిడ్ అయిన ఓ బైక్ ఢీకొట్టింది. ఫలితంగా ఘోర ప్రమాదం జరిగింది. ఆ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.

  • Share this:
    బైక్ పై ఓ వ్యక్తి వేగంగా వెళ్తున్నాడు. తలకు హెల్మెట్ కూడా లేదు. తన ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించి ముందుకు వెళ్దామనున్నాడు. కానీ ఊహించని రీతిలో అతడికి ఎదురుగా ఓ కారు ఎదురొచ్చింది. ఆ కారు కూడా జెట్ స్పీడుతో వేగంగా వస్తోంది. ఒక్క క్షణం ఆలస్యమయితే ఆ కారు తనను గుద్దేయడం, తాను చనిపోవడం ఖాయమని ఆ వ్యక్తి డిసైడ్ అయ్యాడు. అంతే ఒక్క సెకను కూడా అతడు ఆలస్యం చేయలేదు. ఏమయితే అదయిందని ఉన్నట్టుండి బైక్ ను వదిలేసి కిందకు పడిపోయాడు. కొద్ది పాటి గాయాల పాలయినా బతికి ఉంటాను కదా అనుకున్నాడు. అయితే అవతల కారులో ఉన్న వాళ్ల గురించి మాత్రం అతడు ఆలోచించలేకపోయాడు. ఫలితంగా ఆ కారు కూడా ఘోర ప్రమాదానికి గురయింది. ఆ వీడియో కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

    అది గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సిటీకి దగ్గరలోని కొసాంబ పరిధిలో ఉన్న 8వ నెంబర్ జాతీయ రహదారి. వచ్చీ పోయే వాహనాలతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంటుంది. మార్చి 11వ తారీఖు కూడా అదే రీతిలో వాహనాల రద్దీ ఉంది. అయితే సాయంత్రం అయిదు గంటల సమయంలో ఓ వ్యక్తి తన బైక్ పై రయ్యిమంటూ దూసుకెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న వాహనాలను దాటి మరీ వెళ్లాలని ప్రయత్నించాడు. అదే సమయంలో ఎదురుగా అవతలి వైపు నుంచి ఓ కారు దూసుకొస్తోంది. ఒక్క క్షణం అయితే అతడు ఆ కారును ఢీకొట్టేవాడు. ఘోరం జరిగి ఉండేది. కానీ అతడు అప్రమత్తమయి వెంటనే తన బైక్ పై నుంచి కిందకు ఒరిగిపోయాడు.


    ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

    కింద పడిన బైక్ మాత్రం కారు టైర్ల దిశగా దూసుకెళ్లింది. దాన్ని తప్పించేందుకు ఆ కారు డ్రైవర్ ప్రయత్నించడంతో పలితంగా ఆ కారు కూడా ఎగిరి అల్లంత దూరంలో రోడ్డు పక్కన బోర్లా పడిపోయింది. అటు బైక్ నడిపిన వ్యక్తికి, కార్లో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. బైకర్ చేసిన తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందనీ, ఏ విషయంలోనైనా తొందరపాటు సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    ఇది కూడా చదవండి: 40 ఏళ్లుగా సౌదీలోనే.. హైదరాబాద్ కు శాశ్వతంగా తిరిగొస్తుండగా భర్త మృతి.. కనీసం అస్థికలనైనా ఇప్పించండంటూ భార్య కన్నీటి విన్నపం
    Published by:Hasaan Kandula
    First published: