Video: 2 తలల పాము... ఒకేసారి 2 ఎలుకల్ని మింగేసింది... ఎలా?

2 తలల పాము... ఒకేసారి 2 ఎలుకల్ని మింగేసింది (image credit - instagram))

Viral Video: అసలు రెండు తలల పాములు బతకడమే కష్టం. కానీ ఆ పాము హాయిగా బతకడమే కాదు... డబుల్ ఫుడ్ ఆరగిస్తూ... బలంగా పెరుగుతోంది. ఆ వీడియో చూస్తే నోరెళ్లబెట్టడం మనవంతు అవుతుంది.

  • Share this:
    Viral Video: పాముల వీడియోలు చూడాలంటే కొంత మంది భయపడతారు. ఎందుకంటే పాము అంటేనే వారికి ఒకరకమైన భయం, అయిష్టత ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో స్నేక్స్ వీడియోలకు లెక్కలేదు. నిజానికి ఈ వీడియోలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఎందుకంటే... భయం అనేది మనుషులను ఎక్కువ ఎట్రాక్ట్ చేస్తుంది. పామును చూడగానే మనకు కలిగే ఒక రకమైన టెన్షన్... ఆ వీడియోను కళ్లార్పకుండా చూసేలా చేస్తుంది. పాములు, వాటి జాతులు, వాటి ఆహార విధానాలపై ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయి. ఎన్నో పరిశోధనలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా ఓ వీడియో మతిపోగొడుతోంది.

    ఇందులో ఓ పాముకు రెండు తలలు ఉన్నాయి. అంటే రెండు మెదళ్లు ఉంటున్నట్లే. ఆ పాము రెండు మెదళ్లూ పనిచేస్తున్నాయి. అందువల్ల బాడీకి రెండు మెదళ్ల నుంచి సంకేతాలు వెళ్తుంటాయి. అందువల్ల పెద్ద సమస్యే వస్తోంది. ఆ పాము ఒకేసారి రెండు తలలతో.. రెండు ఎలుకల్ని తినడం మొదలుపెట్టింది. ఈ వీడియోని అమెరికాకుచెందిన కంటెంట్ క్రియేటర్ బ్రియాన్ బార్క్ జిక్... పోస్ట్ చేశారు. ఆ పాము రెండు ఎలుకల్నీ ఒకసారి తినేందుకు ఎంతో ఆసక్తిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆహారం వదులుకునే ఉద్దేశంతో లేదు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.



    ఇప్పుడు మనకు ఓ డౌట్ వస్తుంది. రెండు ఎలుకలూ పొట్టలోకి వెళ్తాయా అని. అవును. అది ఒకేసారి డబుల్ ఫుడ్ తింటున్నట్లే. రెండూ పొట్టలోకి వెళ్తాయి. రెండూ అరిగిపోతాయి. కాకపోతే... ఇలా డబుల్ ఆహారం ఒకేసారి తినడం ఆ పాముకి కాస్త ఇబ్బందే.

    ఇది కూడా చదవండి: Lashkar Bonalu: రంగం... భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత... ఏం చెప్పారంటే...

    మనుషుల్లో కవలల లాగే... పాముల్లో ఇవి. జనరల్‌గా ఇలాంటి పాములు ఎక్కువ కాలం బతకవు. కానీ ఈ పామును అత్యంత జాగ్రత్తగా పెంచుతున్నారు. అందుకే ఇంత పెద్దగా పెరిగింది. ఇంతకీ స్నేక్స్ రెండు తలలతో ఎందుకు పుడతాయంటే... పుట్టేటప్పుడు జన్యుపరమైన లోపాలు ఏర్పడితే అలా పుడతాయి. అక్కడికి దగ్గర్లోనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉండి ఉంటుంది అని ఓ యూజర్ కామెంట్ పెట్టడానికి ఇదే కారణం. మొత్తానికి ఈ వీడియోకి మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఇలా ఇది వైరల్ అయ్యింది.
    Published by:Krishna Kumar N
    First published: