Video: షాకింగ్.. పోలీస్‌ని ఢీకొట్టి పారిపోయిన కారు డ్రైవర్

పోలీస్‌ని ఢీకొట్టి పారిపోయిన కారు డ్రైవర్ (image credit - twitter - ANI)

Viral Video: ఆ కారు డ్రైవర్ అలా ఢీకొట్టి మరీ పారిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫానులా వైరల్ అవుతోంది. అది చూసిన వాళ్లంతా ఆ కారు డ్రైవర్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

  • Share this:
    Video: పంజాబ్.. పాటియాలా జిల్లాలో శనివారం జరిగిందీ దారుణం. ఏకంగా పోలీస్‌ని చంపేసి పారిపోయేందుకు యత్నించాడు కారు డ్రైవర్. వేగంగా వెళ్తున్న వాహనాన్ని ఆ పోలీస్... రెగ్యులర్ చెకింగ్‌లో భాగంగా ఆపాడు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ముందస్తు తనిఖీల్లో భాగంగా ఆ కారును ఆపాడు. చెకింగ్ దగ్గర కారును ఆపాలని డ్రైవర్‌కి పోలీస్ సిగ్నల్ ఇచ్చాడు. ఐతే... ఆ డ్రైవర్ కారు ఆపలేదు. ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ కారును ఆపేందుకు పోలీస్ ట్రై చేస్తుంటే... ఆ వ్యక్తి కారును ఆపకపోగా... దాని ముందు ఉన్న పోలీస్‌ని ఢీకొట్టి మరీ పారిపోయిన దృశ్యం కనిపిస్తుంది. ఫలితంగా ఆ పోలీస్... పక్కకు జారి... రోడ్డుపైనే పడిపోయినట్లు కనిపిస్తుంది. పోలీస్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా కారు డ్రైవర్ పారిపోయినట్లు తెలుస్తుంది.

    ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో... పోలీసులు దీన్ని ఓ సవాలుగా తీసుకున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ కనిపెట్టి... అది ఎవరిదో తెలుసుకొని... అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి


    ఇలాంటిదే మరో ఘటన గతేడాది మేలో... పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది. అక్కడి మిల్క్‌బార్ చౌక్ దగ్గర పికెట్ పాయింట్ ఉంది. ఎఎస్సై ముల్క్‌రాజ్... అటుగా వచ్చిన ఓ కారును ఆపి దాని ఎదురుగా నిల్చున్నారు. కారులో యువకుడు... పోలీస్ ఆఫీసర్‌‌ను ఢీకొడుతూ కారు నడిపాడు. ఆఫీసర్ కారు బానెట్‌పైకి ఎక్కి... దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఇలా కొన్ని మీటర్ల దూరం వెళ్లాక... అతన్ని పట్టుకున్నారు.

    మరో ఘటనలో... గతేడాది ఏప్రిల్‌లో... పాటియాలాలో... సంప్రదాయ ఆయుధాలతో... బ్లూటాప్ ధరించి తిరిగే నిహంగాలు... పోలీసులపై దాడి చేశారు. అంతేకాదు... ఏఎస్సై హర్జీత్ సింగ్ చేతిని కత్తితో నరికేశారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లడంతో... డాక్టర్లు 8 గంటలు కష్టపడి... ఆ చెయ్యిని తిరిగి అతికించారు.

    ఈమధ్య తమిళనాడు... తిరుచ్చీలో కూడా గంజాయి స్మగ్లర్ 42 ఏళ్ల మహ్మద్ హనిఫా కారులో పారిపోతుంటే... తిరుచ్చీ హెడ్ కానిస్టేబుల్ శరవణన్ ఛేజ్ చేశారు. కారు బానెట్‌పై ఎక్కిన ఆయన... తన ప్రాణాలకు తెగించారు. ఆ స్మగ్లర్ ఎలాగైనా... ఆయన్ని బానెట్ పై నుంచి కిందకు పడేయాలని కారును వేగంగా నడుపుతూ... అటూ ఇటూ తిప్పుతూ 8 కిలోమీటర్లు దూసుకెళ్లాడు. అయినా సరే... శరవణన్ వెనక్కి తగ్గలేదు. ఉడుములా పట్టేసి... పట్టువిడవకుండా పట్టుదలతో దొంగను పట్టుకున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: