అమెరికా.. ఫిలడెల్ఫియా (Philadelphia) రాష్ట్రంలోని వీధుల్లో కొంతమంది వ్యక్తులు వింతగా ప్రవర్తిస్తున్నారు. రోడ్లపై ఆగి.. ఊగుతూ, తూలులూ.. వింత వైరస్ సోకిన వారిలా వ్యవహరిస్తున్నారు. వారికి ఏమైందో ఎవరికీ అర్థం కావట్లేదు. వారు మద్యం తాగి.. ఆ మత్తులో ఊగుతున్నారా లేక.. వారికి ఏదైనా వింత వైరస్ సోకిందా అనేది తెలియట్లేదు. ఐతే.. వారి తీరు చూస్తుంటే మాత్రం జాంబీల లాగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
సడెన్గా ఈ కలకలం రేగడానికి ఓ వీడియో కారణమైంది. ట్విట్టర్ లోని @dammiedammie35 అకౌంట్లో డిసెంబర్ 6న ఆ వీడియోని పోస్ట్ చేశారు. "బ్రో.. ఏమైంది అమెరికాకి" అని క్యాప్షన్ పెట్టడంతో ఇది నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇందులో.. ఫిలడెల్ఫియాలోని పెద్ద నగరమైన పెన్సిల్వేనియా (Pennsylvania)లో ప్రజలు రోడ్లపై విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నచోటే ఉండిపోయి.. జాంబీలలా ప్రవర్తిస్తున్నారు. ఈ వీడియోలో ఇలాంటి రెండు ఘటనల దృశ్యాలున్నాయి. దీన్ని ఇప్పటివరకూ 2.36 లక్షల మంది చూడగా.. 5వేల మందికి పైగా లైక్ చేశారు.
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
Brooo, what’s happening in the USA????????♂️????? pic.twitter.com/hUJCjZ5Xlx
— Oyindamola???? (@dammiedammie35) December 6, 2022
ఈ దృశ్యాలు నిజమైనవే కానీ.. వాళ్లు ఎందుకు అలా చేస్తున్నారనేదానిపై క్లారిటీ లేదు. మద్యం తాగి ఊగుతున్నారా లేక.. మత్తు పదార్థాల వల్ల అలా చేస్తున్నారా లేక.. ఏదైనా వైరస్ సోకిందా అనే అనుమానాలు నెటిజన్లకు ఉన్నాయి.
"గత వారం రష్యా సైంటిస్టులు.. సైబీరియాలో జాంబీ వైరస్ ఉందని ప్రకటించారు. ఆ వైరస్ అమెరికాలో ప్రవేశించలేదు కదా" అని ఓ యూజర్ ప్రశ్నించారు. "మొత్తానికి జాంబీ వైరస్ వచ్చేసింది. ఇది తొలి దశ" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "జాంబీనా డ్రగ్సా" అని మరో యూజర్ ప్రశ్నించారు.
రష్యా.. సైబీరియాలోని మంచులో.. 48,500 ఏళ్ల నాటి వైరస్లు ఇప్పటికీ బతికే ఉన్నాయనీ.. ఆ మంచు కరిగిపోతే.. వైరస్లు మనపై దాడి చెయ్యగలవని సైంటిస్టులు హెచ్చరించారు. ఈ వార్త వైరల్ అయ్యింది. ఇప్పటికే కరోనాను చూసిన ప్రజలు.. వైరస్ అనగానే భయపడుతున్నారు. అందువల్లే ఈ ఫిలడెల్ఫియా వీడియో కూడా ప్రజలను భయపెడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Viral, Viral Video