Six People Riding On A Two Wheeler: మన దేశంలో టూ వీలర్‌పై వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ఎంత బాగా పాటిస్తారో మీకు తెలిసిందే. పోలీసులు కనిపిస్తే ఒకలా, కనిపించకపోతే మరోలా రూల్స్‌ను మార్చుకుంటారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని చెప్పినా పట్టించుకోరు. కొందరు హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తారు. టూవీలర్‌పై ముగ్గురేసి ప్రయాణించడం ప్రమాదమని చెప్పినా వినరు. అప్పుడప్పుడూ కొందరు రూల్స్‌ను బ్రేక్ చేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు. కొన్నిసార్లు నలుగురు కూడా వెళ్లడం చూస్తుంటాం. కానీ ముంబైలో ఓ స్కూటర్ పై ఏకంగా ఆరుగురు ప్రయాణించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ నింబంధనలను ఉల్లంఘించి ఒకే స్కూటర్‌పై ఆరుగురు వ్యక్తులు కూర్చుని ప్రయానిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంధేరీ వెస్ట్‌లోని స్టార్ బజార్ సమీపంలో ఆరుగురు ఒకే హోండా యాక్టివాపై వెళ్తూ కనిపించారు. దీనికి తోడు రోడ్డుపై విన్యాసాలు చేస్తున్నారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. స్కూటర్ సీటుపై సీటుపై ఐదుగురు అబ్బాయిలు ఉండగా..మరో వ్యక్తి ఓ వ్యక్తి భుజంపై కూర్చున్నాడు. అత్యంత ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ వారు ఎవరూ కూడా హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నారు. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు వారిని చూసి షాకయ్యారు. సర్కస్ ఫీట్‌ను ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా ఫీలయ్యారు. స్కూటర్ వెనుక కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వారిని వీడియో తీశాడు. అనంతరం దానిని ట్విట్టర్ పెట్టి, ముంబై పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశాడు.
Heights of Fukra Panti 6 people on one scooter @CPMumbaiPolice @MTPHereToHelp pic.twitter.com/ovy6NlXw7l
— Ramandeep Singh Hora (@HoraRamandeep) May 22, 2022
ALSO READ Viral Video : సపర్యలు చేసి..జింక ప్రాణాలు కాపాడిన గ్రామస్తులు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఇతరులకు ఇబ్బంది కలుగుజేస్తూ.. ప్రమాదకర స్థితిలో విన్యాసాలు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. దయచేసి ఇలా ఎవరు చేయకూడదని కోరారు. పోలీసులు ఆ వీడియో చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై స్పందిస్తూ అది ఎక్కడ చోటుచేసుకుందో తెలపాలని కోరారు. దీంతో ఆ ట్విట్టర్ యూజర్ అంధేరీ వెస్ట్‌లోని లింక్ రోడ్ అని తెలిపాడు. దీంతో ఆ ప్రాంత పోలీసులు ఈ ఘటనపై విచారణ జరపాలని అధికారులు ఆదేశించారు. డీఎన్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఆ ఉల్లంఘనులను పట్టుకొనే పనిలో ఉన్నారు. ఇక,ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటివారిని వదిలిపెట్టకూడదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mumbai, Traffic police, Viral Video