Viral: టిక్‌టాక్‌లో మనుషుల ఎముకలు అమ్ముతున్న వ్యక్తి.. నైతిక విలువలపై ఆన్‌లైన్‌లో చర్చ

టిక్‌టాక్‌లో 5 లక్షల ఫాలోవర్స్‌ కలిగిన 21 ఏళ్ల అమెరికా కుర్రాడు జాన్‌-పిచయా ఫెర్రీ చేసిన పని ఇప్పుడు ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది. ఇంతకీ ఈ టిక్‌టాకర్‌ ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

టిక్‌టాక్‌లో 5 లక్షల ఫాలోవర్స్‌ కలిగిన 21 ఏళ్ల అమెరికా కుర్రాడు జాన్‌-పిచయా ఫెర్రీ చేసిన పని ఇప్పుడు ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది. ఇంతకీ ఈ టిక్‌టాకర్‌ ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

  • Share this:
టిక్‌టాకర్స్‌ చేసే పనులు చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. నవ్వు తెప్పించే డ్యాన్సులు కావచ్చు.. ఒకింత కోపం తెప్పించే అకతాయి పనులు కావచ్చు.. ఏవైనా సరదాగా అనిపిస్తాయి. అయితే కొందరు చేసే పనులు మాత్రం విచిత్రంగా, దారుణంగా ఉంటాయి. వెతికే ఓపిక ఉంటే ఇలాంటి చిత్రాలు ఎన్నో చూడవచ్చు. ఈ కోవకు చెందిన తాజా ఘటన ఒకటి వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. టిక్‌టాక్‌లో 5 లక్షల ఫాలోవర్స్‌ కలిగిన 21 ఏళ్ల అమెరికా కుర్రాడు జాన్‌-పిచయా ఫెర్రీ చేసిన పని ఇప్పుడు ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది. ఇంతకీ ఈ టిక్‌టాకర్‌ ఇంతకీ ఏం చేశాడో తెలుసా? మనుషుల ఎముకలు, పుర్రెల వీడియోలను అతడు షేర్ చేశాడు. వాటిని అమ్ముతున్నట్లు ప్రకటించాడు. జాన్‌ ప్రదర్శించిన వీడియోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో దుమారం రేపుతున్నాయి. ఈ వీడియోలు చాలా దారుణంగా, కలిచివేసేలా ఉన్నాయని కొంత మంది అభ్యంతరం తెలుపుతున్నారు. ఇతను చూపుతున్న ఎముకలు సినిమాల్లో చూపించే నకిలీవి కావు. ఎముకలకు సంబంధించినవి సరఫరా చేసే తన కంపెనీకి చెందిన ఉత్పత్తులు ఇవి. ఈ టిక్‌టాకర్‌కు న్యూయార్క్‌ నగరంలో కంపెనీ ఉంది. వాటిలో అమ్మేవాటిని ఈ టిక్‌టాకర్‌ తన వీడియోల్లో చూపుతున్నాడు.

జాన్‌ కలెక్షన్స్ చూసిన కొందరు అబ్బురపడుతున్నారు కూడా. కానీ మానవ శరీర భాగాలు ఆన్‌లైన్‌లో అమ్ముతుండటాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. తన కలెక్షన్స్‌ అన్నింటినీ జాన్‌ తన ఇంటి నుంచి చూపుతాడు. ఆ వీడియోలు పోస్టు చేసి, వాటి వెనుక సైన్స్‌, వాటి వివరాలు తెలియజేసి వాటిని ఆన్‌లైన్‌లో అమ్ముతాడు. పుర్రెలు, రకరకాల ఎముకలు విక్రయించేందుకు ఈ కుర్రాడికి ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ కూడా ఉంది.

అయితే నైతికంగా తప్పేమో కానీ ఈ వ్యాపారం అమెరికాలో అక్రమమేమి కాదు. కళాకారులు, కీళ్ల నిపుణులు, విశ్వవిద్యాలయాలు తన కస్టమర్లుగా ఉన్నారని ఈ కుర్రాడు గొప్పగా చెప్పుకుంటాడు. ఎముకలకు సంబంధించిన వస్తువులు అమ్మే ఆస్టియాలజీ కంపెనీలు పుర్రెలు, ఎముకలను గుర్తించని శవాల నుంచి సేకరిస్తాయి.

ఇతని కలెక్షన్స్‌కు కొన్ని ఆసక్తికరమైన రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ వీడియోలు ఒకింత దారుణంగా ఉన్నా ఆసక్తికరంగా ఉన్నాయని, సైన్స్‌ గురించి అవి తెలియజేస్తున్నాయని ఒక యూజర్‌ స్పందించాడు. ఇవి నిజమైనవి కావని చెప్పండి మరో యూజర్‌ రాశాడు. ఆస్టియాలజీ అంటే ఎముకల అధ్యయనం శాస్త్రం. ఆస్టియాలజీ ప్రాక్టీస్‌ చేసేవారిని ఆస్టియోలాజిస్ట్‌ అంటారు. ఇది ఎముకల నిర్మాణం, పుర్రెలోని భాగాలు, దంతాలు, ఎముకల అంతర్గత నిర్మాణం, సహ అనేక విషయాలు ఇందులో ఇమిడి ఉంటాయి.
Published by:Krishna Adithya
First published: