SHOCKING THINGS REVEALED IN FACEBOOK DATA BREACH INCIDENT ZUCKERBERG PERSONAL PHONE NUMBER ALSO LEAKED HSN
Facebook Data Breach: జుకర్బర్గ్ ఫోన్ నెంబర్ లీక్.. సిగ్నల్స్ యాప్ లో అకౌంట్ కూడా.. కలకలం రేపుతున్న హ్యాకింగ్ ఘటన..!
జుకర్బర్గ్ (ఫైల్ ఫొటో)
ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో అతిపెద్ద డేటా బ్రీచ్ గా చెబుతున్న ఈ హ్యాకింగ్ ఘటనకు సంబంధించి టెక్ పరిశోధకుడు, హ్యాకింగ్ విశ్లేషకుడు అయిన డేవ్ వాకర్ మరో సంచలన నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ విషయం తెలిసి ఫేస్బుక్ యూజర్లే ఆశ్చర్యానికి గురవుతున్నారు.
తాజాగా జరిగిన ఫేస్బుక్ హ్యాకింగ్ ఘటనలో పలు సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 533 మిలియన్ల ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు ఇటీవల జరిగిన హ్యాకింగ్ లో లీకయిన సంగతి తెలిసింది. వీరిలో 60 లక్షల మంది భారతీయ ఫేస్బుక్ వినియోగదారులు కాగా, 32 మిలియన్ల మంది అమెరికన్లు, 11 మిలియన్ల మంది యూకేకు చెందిన వాళ్లు ఉన్నారు. 533 మిలియన్ల మంది వ్యక్తిగత ఫోన్ నెంబర్లను డేటాబేస్ హ్యాకర్ల ఫోరమ్ లో పోస్ట్ కావడం గమనార్హం. ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో అతిపెద్ద డేటా బ్రీచ్ గా చెబుతున్న ఈ హ్యాకింగ్ ఘటనకు సంబంధించి టెక్ పరిశోధకుడు, హ్యాకింగ్ విశ్లేషకుడు అయిన డేవ్ వాకర్ మరో సంచలన నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ విషయం తెలిసి ఫేస్బుక్ యూజర్లే ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ అతి పెద్ద డేటా బ్రీచ్ లో ఏకంగా ఫేస్ బుక్ దిగ్గజం వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ వ్యక్తిగత వివరాలు కూడా బహిర్గతం అయ్యాయంటూ డేవ్ వాకర్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ‘మార్కు జుకర్ పేరు, పుట్టిన తేదీ, పెళ్లయిన తేదీ, ఫేజ్ బుక్ యూజర్ ఐడీ, ఆయన ఫోన్ నెంబర్ వంటి వివరాలు అన్నింటినీ హ్యాకర్లు చోరీ చేయగలిగారు. మార్క్ జుకర్ బర్గ్ కు సిగ్నల్స్ యాప్ లో ఖాతా కూడా ఉంది. ఆయన ఫోన్ నెంబర్ ఇదే’ అంటూ ట్విటర్లో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
In another turn of events, Mark Zuckerberg also respects his own privacy, by using a chat app that has end-to-end encryption and isn't owned by @facebook
This is the number associated with his account from the recent facebook leak. https://t.co/AXbXrF4ZxE
ఫేస్బుక్ సంస్థలకు చెందని ఓ యాప్ ను మార్క్ జుకర్ బర్గ్ వినియోగిస్తున్నారనీ, వ్యక్తిగత ప్రైవసీని ఆయన కూడా కోరుకుంటున్నారని డేవ్ వాకర్ సెటైర్లు కూడా వేశారు. కాగా, ఈ విషయంపై ఫేస్బుక్ అధికారికంగా స్పందించింది. ఇదంతా పాత డేటా అని కొట్టి పారేసింది. దాదాపు రెండేళ్ల క్రితమే అంటే 2019వ సంవత్సరంలోనే ఈ లోపాన్ని సరిదిద్దామని ఓ ప్రకటనలో పేర్కొంది. అలోన్ గాల్ అనే మరో సైబర్ నిపుణుడు మరో కొత్త వాదనకు తెరలేపారు. ఇప్పుడు హ్యాక్ అయ్యాయంటూ చెబుతున్న 533 మిలియన్ల యూజర్ల డేటా అంతా పాతదేననీ, గత జనవరిలో ఈ హ్యాకింగ్ జరిగిందని చెబుతున్నాడు.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.