కొంత మంది పిల్లలు సినిమాలు, సీరియళ్లను ఇమిటేట్ చేస్తుంటారు. తమను తాము.. హీరోలుగా భావిస్తుంటారు. వారు సినిమాలలో చేసే స్టంట్ లు చేస్తుంటారు. కొందరు.. కార్టూన్ లలోని హీరోలుగా భావిస్తుంటారు. సూపర్ మెన్, హీమాన్, శక్తిమాన్ లుగా అనుకుంటారు. అసలు ఈ పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. కేవలం జనాలను నవ్వించడానికి లేదా ఏదైన ఎంటర్ టైన్ మెంట్ చేయడానికి ఇలాంటి స్టంట్ లు చేస్తుంటారు. కానీ కొంత మంది దీన్ని గుడ్డిగా ఫాలో అవుతుంటారు. హీరోల స్టంట్ లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ (Uttar pradesh) షాకింగ్ ఘటన జరిగింది. లక్నోలోని గోమతి నగర్ లో ఒక బాలుడు ట్రక్ మీదకు ఎక్కాడు. ఆ తర్వాత.. అక్కడ నేనే శక్తి మాన్ అంటూ రకరకాల విన్యాసాలు చేశాడు. ఇంతలో అక్కడే పుష్ అప్ కూడా చేశాడు. అనేక స్టంట్ లు చేశాడు. ట్రక్ వేగంగా వెళ్తుంది. అయితే, ట్రక్ లో ఉన్న డ్రైవర్ ఇదంతా గమనించలేదు. దీంతో అతను ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కిందపడ్డాడు.
गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य-
बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान!
चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ
— Shweta Srivastava (@CopShweta) July 17, 2022
దీంతో రోడ్డుపైన ఉన్న.. బండలు అతడికి గుచ్చుకున్నాయి. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అతని విన్యాసాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాకింగ్ నకు గురౌతున్నారు.
ఇదిలా ఉండగా వెడ్డింగ్ రిసెప్షన్ లో షాకింగ్ ఘటన జరిగింది.
హవాయి బిగ్ ఐలాండ్ పశ్చిమ తీరంలో కైలువా-కోనాలోని హులిహీ ప్యాలెస్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న హోటల్ లో పెళ్లి రిసెప్షన్ వేడుకను ప్లాన్ చేశారు. అప్పుడు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడ హజరయ్యారు. కార్యక్రమం ఎంతో సందడిగా జరుగుతుంది. అతిథులంతా.. పార్టీలో నిమగ్నమయ్యారు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. హవాయిలో సముద్రతీర వివాహ వేడుకలో భారీ అలల శ్రేణిని ఢీకొట్టింది.
దీంతో అక్కడి వారు.. భయంతో దూరంగా పరుగులు పెట్టారు. చూస్తుండగానే.. వెంట వెంటనే అలలు, ఒడ్డువైపునకు వచ్చాయి. దీంతో అతిథులు భయంతో పరుగులు పెట్టారు. కొంత మంది నీళ్లలో తడిసిపోయారు. అక్కడ ఉన్న కుర్చీలు, పదార్థాలంతా నీళ్లలో తడిసిపోయాయి. అక్కడి వారు.. ఈ ఘటనను వీడియో తీస్తున్నారు. ప్రస్తుతంఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా (Viral video) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, Viral Video