IRCTC: ఐఆర్‌సీటీసీ యాప్‌లో పోర్న్ యాడ్స్... కంప్లైంట్ ఇచ్చిన యూజర్‌కు షాకిచ్చే రిప్లై

IRCTC | ట్విట్టర్‌లో తన ఫిర్యాదును ఐఆర్‌సీటీసీ పరిగణలోకి తీసుకొని సమస్యను పరిష్కరిస్తుందని భావించాడు. కానీ ఐఆర్‌సీటీసీ నుంచి ఊహించని రిప్లై వచ్చింది.

news18-telugu
Updated: May 30, 2019, 11:41 AM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ యాప్‌లో పోర్న్ యాడ్స్... కంప్లైంట్ ఇచ్చిన యూజర్‌కు షాకిచ్చే రిప్లై
IRCTC: ఐఆర్‌సీటీసీ యాప్‌లో పోర్న్ యాడ్స్... కంప్లైంట్ ఇచ్చిన యూజర్‌కు షాకిచ్చే రిప్లై (Image credit: Twitter)
  • Share this:
ఎప్పుడూ రైల్వే రిజర్వేషన్, క్యాటరింగ్, టూర్ ప్యాకేజీలతో వార్తల్లో నిలిచే ఐఆర్‌సీటీసీ ఈసారి ఓ కంప్లైంట్‌తో వార్తల్లోకి వచ్చింది. ఐఆర్‌సీటీసీ అధికారిక యాప్ ఓపెన్ చేస్తే పోర్న్ యాడ్స్ వస్తున్నాయని, తరచూ అశ్లీల ప్రకటనలు చూడాల్సి వస్తోందని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. ఐఆర్‌సీటీసీ అధికారిక ట్విట్టర్ ఖాతాతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్ హ్యాండిల్స్‌కు తన కంప్లైంట్‌ను ట్యాగ్ చేశాడు. తాను యాప్‌లో ఎలాంటి యాడ్స్ చూస్తున్నానో వాటి స్క్రీన్‌షాట్స్ తీసి మరీ ట్వీట్ చేశాడు. ఇలాంటి యాడ్స్‌తో ఇబ్బందిగా, చికాకుగా ఉందని తన ఆవేదనను పంచుకున్నాడు. ఆ ట్వీట్ ఇదే.



ట్విట్టర్‌లో తన ఫిర్యాదును ఐఆర్‌సీటీసీ పరిగణలోకి తీసుకొని సమస్యను పరిష్కరిస్తుందని భావించాడు. కానీ ఐఆర్‌సీటీసీ నుంచి ఊహించని రిప్లై వచ్చింది. అది రిప్లైలా లేదు... ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఐఆర్‌సీటీసీ క్లాస్ తీసుకున్నట్టు ఉంది. "ఐఆర్‌సీటీసీ ప్రకటనల కోసం గూగుల్‌కు చెందిన యాడ్ సర్వింగ్ టూల్ ADX ఉపయోగిస్తుంది. యూజర్ల బ్రౌజర్‌లోని హిస్టరీని, బ్రౌజింగ్ బిహేవియర్‌ను బట్టి యాడ్స్ కనిపిస్తాయి. అలాంటి యాడ్స్ కనిపించకూడదంటే దయచేసి మీ బ్రౌజర్‌లోని కుకీస్, హిస్టరీ డిలిట్ చేయండి" అని ఐఆర్‌సీటీసీ రైల్వే సేవ ట్విట్టర్ హ్యాండిల్‌ నుంచి రిప్లై వచ్చింది.



ఐఆర్‌సీటీసీ ఇలాంటి రిప్లైతో యూజర్‌కు క్లాస్ తీసుకున్నాక ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఊరుకుంటారా? ఓ రేంజ్‌లో రిప్లైస్ ఇచ్చారు. సెటైర్లు, నవ్వు తెప్పించే మీమ్‌లతో ట్రోల్ చేశారు.









మొత్తానికి దిమ్మదిరిగేలా యూజర్‌కు ఐఆర్‌సీటీసీ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

OPPO Reno: 'ఒప్పో రెనో' 10x జూమ్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

IRCTC: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి



Durex Study: శృంగారం సమయంలో భావప్రాప్తికి 70% భారతీయ మహిళలు దూరం

Jobs: ఈపీఎఫ్ఓలో 280 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Published by: Santhosh Kumar S
First published: May 30, 2019, 11:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading