• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • SHOCKING PHOTO MAN RIDES A HUGE CROCODILE LIKE A SURFBOARD VIRAL PICTURES SPARK OUTRAGE GH SK

Viral photo: ఇదేందయ్యా ఇది.. భారీ మొసలిపై ఎక్కి సర్ఫింగ్‌.. ఎప్పుడూ చూడని స్టంట్

మొసలిపై సర్ఫింగ్ (Image:Reddit)

మొసలిపై సర్ఫింగ్ చేసిన వ్యక్తిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. వణ్య ప్రాణులను హింసించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నించారు. స‌రీసృపాల సంర‌క్ష‌ణ గురించి చాలా మంది గుర్తుచేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Share this:
మొసళ్లనూ చూస్తేనే భయమేస్తుంది. భారీ ఆకారంతో భయకరంగా ఉంటుంది. జూలో చూసేందుకే చాలా మంది జంకుతుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా మొసలిపైకి ఎక్కి సర్ఫింగ్ చేశాడు. ఆస్ట్రేలియాలో ఈ ఘటన జరిగింది. వివిధ రకాల వణ్యప్రాణులకు, వాటి సంరక్షణ కేంద్రాలకు ఆస్ట్రేలియా కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. ఆ దేశంలో స‌రీసృపాల‌కు సంబంధించిన ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గానే జ‌రుగుతుంటాయి. వింతైన జంతువులకు సంబంధించిన దృశ్యాలు ఇక్కడ ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. వీటిలో చాలా వ‌ర‌కూ అడ‌వికి సంబంధించిన‌వే ఉండ‌టం విశేషం. తాజాగా ఆ దేశంలో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. నీటిలో తేలుతున్న భారీ మొసలిపై ఎక్కి నిల్చున్నాడు ఒక వ్యక్తి. దానిపై సర్ఫింగ్ చేయడానికి అతడు ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

సాధారణంగా ఆస్ట్రేలియా ప్రజలు రెప్టైల్స్‌కు, ఇత‌ర వ‌ణ్యప్రాణుల‌కు దూరంగా ఉంటారు. ఇంకొంద‌రు మాత్రం వాటితో గడిపేందుకు ఇష్టపడతారు. ఆ దేశంలో ఒక మొర‌టు మ‌నిషి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచే ప‌నిచేశాడు. స్వ‌త‌హాగా ఫొటోగ్రాఫ‌ర్ అయిన ఆ వ్యక్తి.. స‌ర్ఫ్ బోర్డ్‌పై ప్ర‌యాణించిన‌ట్లు ఒక భారీ మొస‌లిపై నిల్చున్నాడు. అంత‌గా లోతులేని ఆ నీళ్ల‌ల్లో కొద్దిగా మునిగిన‌ట్లు క‌నిపిస్తున్న పెద్ద‌ మొస‌లిపై అతడు నిల్చున్నాడు. వైరల్‌గా మారిన ఈ ఫోటోను ముందు రెడ్డిట్‌లో షేర్ చేశారు. అయితే యూజ‌ర్లు దీనిపై కోపంగా ప్ర‌తిస్పందించే స‌రికి రెడ్డిట్ ఫోటోను తొల‌గించింది.

ఎక్కువ మంది యూజ‌ర్లు ఫోటోలో ఉన్న వ్య‌క్తి చేసిన ప‌నిని విమ‌ర్శించారు. వణ్య ప్రాణులను హింసించడం ఏంటని ప్రశ్నించారు. స‌రీసృపాల సంర‌క్ష‌ణ గురించి చాలా మంది గుర్తుచేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరు మాత్రం ఆ వ్య‌క్తి చేసిన సాహ‌సాన్ని అభినంధించారు. కొన్నివారాల క్రితం, ఒక ఆస్ట్రేలియ‌న్ ఫోటోగ్రాఫ‌ర్ చిత్రీక‌రించిన సన్నివేశం కూడా వైరల్‌గా మారింది. ఒక‌ భారీ మొస‌లి షార్క్ చేప‌ను నోటితో పట్టుకున్న సన్నివేశాన్ని కెమెరాలో బంధించారు ప‌రిశోధ‌క శాస్త్ర‌వేత్త‌, ఫోటోగ్రాఫ‌ర్ అయిన మార్క్ జిమ్‌బిక్కీ. 46 ఏళ్ల వ‌య‌సున్న మార్క్ ఆస్ట్రేలియాలోని తూర్పు తీరాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు ఈ ఫోటో తీశారు. దీంతోపాటు మ‌రొక ఫోటోలో 680 కిలోల ఒక నైల్ మొస‌లి 45 కిలోల బుల్ షార్క్ పిల్ల‌ను నోట్లో బంధించ‌డం క‌నిపిస్తుంది. అల్పాహారం తిన‌డానికి దాని నోరు వెడ‌ల్పుగా తెరుచుకొని ఉంటుంది. అలాంటి మొండి మొస‌లి పైన ఒక మొర‌టు వ్య‌క్తి ఎక్కితే ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published: