హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. జెడ్ స్పీడ్ తో దూసుకొస్తున్న రైలు ముందుకు వెళ్లాడు... తర్వాత..

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. జెడ్ స్పీడ్ తో దూసుకొస్తున్న రైలు ముందుకు వెళ్లాడు... తర్వాత..

రైలు ముందుకు వెళ్లిన వ్యక్తి

రైలు ముందుకు వెళ్లిన వ్యక్తి

Haryana: వ్యక్తి రైలు వంతెనను క్రాస్ చేస్తున్నాడు. అప్పుడు వేగంగా ట్రైన్ వస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి రైల్వే క్రాస్ చేయడానికి వెళ్లాడు.

  కొందరు అనవసర సాహసాలు చేస్తుంటారు. దీంతో అనుకోకుండా రిస్క్ లో ఇరుక్కుంటారు. రైలు క్రాసింగ్ దగ్గర గేట్ పడిన కూడా కొంత మంది ఆగకుండా ముందుకు వెళ్తారు. ఇంకొంత మంది రైలువస్తుంటే..ప్లాట్ ఫామ్ మీద ఒక వైపు నుంచి మరోక వైపుకు పరిగెడుతుంటారు. ఇంకొందరు రైలులో నుంచి వేలాడుతూ.. పిచ్చి పిచ్చి స్టంట్ లు చేస్తుంటారు. దీంతో కొన్ని సార్లు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి ఎన్నో షాకింగ్ వీడియోలు గతంలో వైరల్ గా మారాయి. మరో వీడియో ప్రస్తుంత సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.

  పూర్తి వివరాలు.. హర్యానాలో (Haryana) షాకింగ్ ఘటన జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలోని బవానా గ్రామంలో సోమవారం ఒళ్లుగగుర్పొడిచే ఘటన జరిగింది. మజ్రా ఖుర్ద్ గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యురిటీ ఫోర్స్) సిబ్బంది జవాన్ వీర్ సింగ్.. తన ఇంటికి వచ్చాడు. తన సోదరి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో.. మజ్రా ఖుర్ధ్ వద్ద రైల్వే క్రాసింగ్ ఉంది. అప్పుడు పట్టాల మీద రేవాలి నుంచి దురంతో ఎక్స్ ప్రెస్ అత్యంత వేగంగా వస్తుంది. ఎలాగైన రైలు కన్నా ముందు పట్టాలు దాటాలని అనుకున్నాడో.. మరేంటో కానీ అతను.. రైలు పట్టాల మీదకు వెళ్లాడు.

  అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. రైలు వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. అతను గాల్లో బంతిలాగ ఎగిరి అల్లంత దూరం పడ్డాడు. కాగా, ప్రమాదానికి చెందిన ఫుటెజ్ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతను అక్కడే చనిపోయాడు. స్థానికులు అతడని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, 2001 లో వీర్ సింగ్ బీఎస్ఎఫ్ లో చేరినట్లు స్థానికులు తెలిపారు. సెలవులు పెట్టుకుని ఇంటికి వస్తే.. ఇంత ఘోరం జరిగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఇదిలా ఉండగా వెడ్డింగ్ రిసెప్షన్ లో షాకింగ్ ఘటన జరిగింది.

  హవాయి బిగ్ ఐలాండ్ పశ్చిమ తీరంలో కైలువా-కోనాలోని హులిహీ ప్యాలెస్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న హోటల్ లో పెళ్లి రిసెప్షన్ వేడుకను ప్లాన్ చేశారు. అప్పుడు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడ హజరయ్యారు. కార్యక్రమం ఎంతో సందడిగా జరుగుతుంది. అతిథులంతా.. పార్టీలో నిమగ్నమయ్యారు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. హవాయిలో సముద్రతీర వివాహ వేడుకలో భారీ అలల శ్రేణిని ఢీకొట్టింది.

  దీంతో అక్కడి వారు.. భయంతో దూరంగా పరుగులు పెట్టారు. చూస్తుండగానే.. వెంట వెంటనే అలలు, ఒడ్డువైపునకు వచ్చాయి. దీంతో అతిథులు భయంతో పరుగులు పెట్టారు. కొంత మంది నీళ్లలో తడిసిపోయారు. అక్కడ ఉన్న కుర్చీలు, పదార్థాలంతా నీళ్లలో తడిసిపోయాయి. అక్కడి వారు.. ఈ ఘటనను వీడియో తీస్తున్నారు. ప్రస్తుతంఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా (Viral video)  మారింది.

  Published by:Paresh Inamdar
  First published:

  Tags: Haryana, Train, Viral Video

  ఉత్తమ కథలు