SHOCKING IPHONE LOST FOR 10 YEARS TAKEN OUT FROM TOILET PAH
Viral News: ఊహించని సంఘటన.. పదేళ్ల క్రితం పోయిన ఐఫోన్.. బాత్రూం ఫ్లష్ లో..
ఐఫోను (ఫైల్)
Viral News: సెల్ ఫోనంటే ఇష్ట పడని వారున్నారంటే వింత అనుకోవాలి. దాదాపు ప్రతి ఒక్కరు ఫోనును ఇష్టపడుతుంటారు. ఒక్కొసారి అనుకొకుండా దీన్ని కోల్పోతే చాలా బాధపడతారు. ఇక పోయిన ఫోను తిరిగి దొరికితే ఇంకేమైన ఉందా.. ఆనందంతో గంతులేస్తారు. వారి ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం ఇలాంటి సంఘటన అమెరికాలో జరిగింది.
Viral News: నేటి యువత సెల్ ఫోను లంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వాటిని ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు. మార్కెట్ లో ఏ కొత్త మోడల్ వచ్చిన వెంటనే కొనేస్తుంటారు. ఇక యువతకు ఐఫోను (i phone) నచ్చుతుందని ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఒక వేళ అనుకొకుండా తమ సెల్ పోను పోతే ఎదో కొల్పోయినట్లు భావిస్తుంటారు. ఇలాంటి సంఘటన ప్రస్తుతం అమెరికాలో జరిగింది.
మనం ఎంతో ఇష్టంగా కొనుకున్న వస్తువు మనకు కాసేపు కనబడకపోతే ఎదోలా అయిపోతాం. తీవ్ర గందర గోళానికి గురుతాం. అదే విధంగా మనకు ఇష్టమైన వారి కోసం.. సెల్ ఫోనులు, గాడ్జెట్స్ లు బహుమతులుగా ఇస్తుంటాం. వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటాం. ఒక్కొసారి ఇలాంటి వస్తువులు మనకు కనపడకపోతే తీవ్ర మనస్తాపానికి గురౌతాం.
అయితే, ఒక్కొసారి మనమే వస్తువులను ఎక్కడో పెట్టి మరచిపోతాం. ఆ తర్వాత కొన్ని రోజులకు అది దొరకగానే ఎంతో సంతోషపడతాము. అయితే, అమెరికాలో జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. బెక్కి బెక్ మన్ అనే మహిళ అమెరికాలోని మెరిల్యాండ్ లో ఉంటుంది. ఆమె 2012లో ఒక యాపిల్ఐఫోన్ (Apple i phone) ను ఎంతో ఇష్టంగా కొనుక్కుంది. దాన్ని ప్రతి రోజు తనతో పాటే ఉంచుకునేది. అయితే, ఒక రోజు అది కనపడకుండా పోయింది. బెక్కి బెక్ మన్ దాన్ని ఎక్కడ పెట్టిందో పూర్తిగా మరిచిపోయింది. దాని కోసం చాలా వెతికింది. ఎంత గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించిన పాపం.. ఆమెకు ఫోన్ మాత్రం దొరకలేదు. ఫోను పోయి దాదాపు.. పదేళ్లు గడిచిపోయాయి.
తాజాగా, ఒక రోజు వారి ఇంట్లోని బాత్రూం మరమ్మత్తులు చేస్తుండగా టాయ్ లేట్ ఫ్లష్ నుంచి పెద్ద శబ్దం వచ్చింది. ఎదో వస్తువు కింద పడ్డట్లు బెక్కి భర్త గమనించాడు. దాన్ని చూసి.. ఫోను గా గుర్తించాడు. అది తన భార్యకు చూపించాడు. దాన్ని చూసి బెక్కి షాక్ కు గురయ్యింది. పదేళ్ల క్రితం పోయిన ఫోను ఇదేనని సంతోషపడింది.
అయితే, ఐఫోను బాత్రూంలో ఎలా వెళ్లిందో వారి బుర్రకు మాత్రం తట్టలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘అక్కడికి ఫోన్ ఎలా వెళ్లింది.., ఫోను పనిచేస్తుందా.. ’అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.