Viral: వీడి పైత్యం పాడైపోను.. మలద్వారంలోకి ఈల్ చేప.. ఆ తరువాత ఏమైందంటే...

ప్రతీకాత్మక చిత్రం

గతంలో కూడా 50 ఏళ్ల చైనీస్ వ్యక్తి మలబద్దకం నుంచి ఉపశమనం కలగాలని ఈల్ చేపను తన మలద్వారంలో పెట్టుకున్నాడు.

  • Share this:
ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుంచి బయట పడేందుకు రకరకాల వైద్య చికిత్సా విధానాలను పాటిస్తున్నారు. అయితే చైనాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు పిచ్చి పని చేశాడు. సుమారు 20 సెంటీమీటర్ల పొడవు గల ఓ ఈల్ చేపను తన మలద్వారంలోకి జొప్పించాడు. అయితే ఆ చేప మలద్వారం నుంచి పైకి ఎగబాకి అతడి పొత్తి కడుపులోకి ప్రవేశించింది. దీంతో తీవ్రమైన నొప్పి రావడంతో బాధితుడు ఆసుపత్రి పాలయ్యాడు. వైద్యులు ఆపరేషన్ చేసి అతని పొత్తికడుపు నుంచి ఈల్ చేపను తీసేశారు.

ఈ షాకింగ్ ఘటన చైనాలోని జింగ్హువాలో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి చాలా రోజులుగా మలబద్ధకంతో బాధ పడుతున్నాడు. అయితే తన సమస్యను నివారించాలని అతడు బాగా ప్రాచుర్యం పొందిన ఒక 'ఫోక్ రెమిడీ' ని ఆశ్రయించాడు. మలాశయంలోకి ఈల్ చేపను పంపిస్తే మలవిసర్జన సుఖంగా జరుగుతుందని గుడ్డిగా నమ్మేశాడు. నిజంగానే 20 సెంటీమీటర్ల చేపను మలద్వారంలో పెట్టుకున్నాడు.

అయితే ఆ చేప మలాశయంలోకి వెళ్లి.. అక్కడ రంధ్రం చేసి పొత్తికడుపు లోకి ప్రవేశించింది. ఫలితంగా అతి సున్నితమైన పెద్ద పేగుకి రంధ్రం కావడంతో తీవ్రమైన రక్తస్రావం అయ్యింది. దీంతో ఆ నొప్పి భరించలేక సదరు వ్యక్తి నరకం అనుభవించాడు. ఆసుపత్రికి వెళితే పరువు పోతుందేమోనని భయంకరమైన నొప్పిని కూడా భరించాడు. కానీ ఆ నొప్పి మరింత పెరగడంతో ఇక తట్టుకోలేక ఆసుపత్రిని ఆశ్రయించాడు. దీంతో వైద్యులు అతి జాగ్రత్తగా ఆపరేషన్ చేసి అతడి ప్రాణాలను కాపాడగలిగారు.

ఈ ఘటనపై ఆపరేషన్ చేసిన ఓ డాక్టర్ మీడియాతో మాట్లాడారు. బాధితుడి పెద్ద ప్రేగులోని బ్యాక్టీరియా ఉదర కుహరానికి చేరుకున్నట్లయితే హీమోలైసిస్ వ్యాధి వచ్చి ఉండేదని అన్నారు. హీమోలైసిస్ వస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.

గతంలో కూడా 50 ఏళ్ల చైనీస్ వ్యక్తి మలబద్దకం నుంచి ఉపశమనం కలగాలని ఈల్ చేపను తన మలద్వారంలో పెట్టుకున్నాడు. అయితే ఆ చేప ఉదరకుహరంలోకి వెళ్లడంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతికష్టం మీద వైద్యులు ఆపరేషన్ చేసి అతడిని బతికించారు. కొంచెం ఆలస్యమైనా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని డాక్టర్లు చెప్పారు. అయితే జనాలు చెప్పే వైద్యాన్ని నమ్మి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సొంత వైద్య చికిత్సా విధానాలను అసలే పాటించలేదని సూచిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published: