Shocking: నదిలో నగ్నంగా అమ్మాయి! చూసి షాకైన ప్రజలు! బయటకు తీశాక ఏమైందంటే

జపాన్‌లో ఓ రోజు (image credit - youtube)

Shocking: ఎవరైనా సరే... నదిలో కొట్టుకుపోతూ ఉంటే కాపాడేందుకు ప్రజలు ముందుకొస్తారు. అలాంటి ఓ సందర్భం తాజాగా జరిగింది. అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. షాకైన ప్రజలు... ఇంకా ఇలాంటివి భవిష్యత్తులో ఎన్ని చూడాల్సి వస్తుందో అనుకున్నారు.

  • Share this:
    అది జపాన్‌లోని హాచినోహే ప్రాంతం. అక్కడ కాలువ లాంటి నది రోడ్డు పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. సడెన్‌గా ఆ నదిలో... ఓ అమ్మాయి కనిపించింది. చూడ్డానికి నగ్నంగా ఉన్నట్లు కనిపించింది. ఆమె ఆల్రెడీ చనిపోయి ఉంటుందని ప్రజలు అనుకున్నారు. ఆ తర్వాత ఎవరో పోలీసులకు కాల్ చేశారు. వెంటనే ఫైరింజన్, పోలీసులు, అంబులెన్స్ అన్ని విభాగాల వారూ వచ్చేశారు. అప్పటికే చాలా మంది ప్రజలు పోగయ్యారు. చనిపోయింది ఎవరు... ఎందుకు నగ్నంగా చనిపోయింది... అది సూసైడా... లేక ఎవరైనా ఆమెను రేప్ చేసి... నదిలో పడేసి.. చంపేశారా ఇలా ఎన్నో అనుమానాలు. అందరి ముఖాల్లో ఏదో తెలియని ఆందోళన. అధికారులేమో... ఆమెను బయటకు తియ్యడానికి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు.

    పావు గంట పాటూ... శ్రమించిన అధికారులు... మొత్తానికి ఓ తాడుతో ఆమెను బయటకు తీశారు. అప్పుడు తెలిసింది... అసలు ఆమె ఆమె కాదు అని. అదో సెక్స్ డాల్. అచ్చం మనిషి సైజులోనే ఉంది. పైగా బట్టలు సరిగా లేవు. దాంతో నదిలో చూసినప్పుడు... నగ్నంగా ఉన్న అమ్మాయి శవంలా కనిపించింది. తీరా అది నిజమైన మనిషి కాదని తెలియడంతో... ప్రజలు, అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు.

    ఆ తర్వాత మరో డౌట్ వచ్చింది. అసలా సెక్స్ డాల్‌ని నదిలో పడేసింది ఎవరు? ఎందుకు పడేశారు? అని... ఇలా ప్రజలు, రోడ్డున పోయేవాళ్లు అందోళన చెందుతుంటే... అధికారులు కూడా ఇలా చేయకుండా ఉండాల్సింది అని తెలిపారు.

    నిజం తెలిశాక... ఇక అక్కడ ఎవరూ ఉండకుండా... వెళ్లిపోయారు. అయితే... అప్పటికే ఈ విషయం వైరల్ అయ్యింది. కొంత మంది దీనికి సంబంధించి యూట్యూబ్‌లో వీడియోలు పెట్టారు. Tanaka Natsuki అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే... దీనికి సంబంధించిన వీడియోలు వస్తున్నాయి.

    నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ రాస్తున్నారు. ఓ యూజర్ దీనిపై స్పందిస్తూ... "వామ్మో... ఇలాంటిది నేను రాత్రివేళ చేపలు పడుతూ చూశానంటే... ఇంకేమైనా ఉందా." అని కామెంట్ రాశారు. మరో యూజర్ "ఇది ఫన్నీయే కావచ్చు... కానీ ఎమర్జెన్సీ సర్వీస్ వాళ్లకు ఇలాంటిది ఫన్నీ కాదు... మీ చెత్తను పారేసేటప్పుడు ఎక్కడబడితే అక్కడ పారేయవద్దు" అని రాశారు.

    ఇది కూడా చదవండి: Viral Video: నడిచే చెట్టు.. ఎప్పుడైనా చూశారా.. అరుదైనది.. ప్రకృతి వింత.. వీడియో

    జపాన్‌లో సెక్స్ డాల్స్ వాడకం ఎక్కువ. ఫలితంగా పాడైన వాటిని ఇలా ఎక్కడబడితే అక్కడ పారేస్తుండటం కలకలం రేపుతోంది.
    Published by:Krishna Kumar N
    First published: