2011 జపాన్ సునామీ కొత్త ఫుటేజ్ రిలీజ్... చూస్తే షాకే...

9.0 Earthquake and Tsunami in 2011 : అప్పట్లో వచ్చిన సునామీ వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్ తీవ్రంగా నష్టపోయింది. సునామీకి సంబంధించిన తాజా ఫుటేజ్ ఆశ్చర్యపరుస్తోంది.

news18-telugu
Updated: February 15, 2020, 7:35 AM IST
2011 జపాన్ సునామీ కొత్త ఫుటేజ్ రిలీజ్... చూస్తే షాకే...
2011 జపాన్ సునామీ కొత్త ఫుటేజ్ రిలీజ్... చూస్తే షాకే...
  • Share this:
9.0 Earthquake and Tsunami in 2011 : దశాబ్దం కిందట 2011లో వచ్చిన భారీ భూకంపం వల్ల జపాన్‌ని భారీ సునామీ ముంచెత్తిన విషయం మనకు తెలుసు. ఇప్పటివరకూ జపాన్‌లో వచ్చిన అతి పెద్ద భూకంపం అదే. రిక్టర్ స్కేలుపై అది 9.0గా నమోదైంది. 1900 నుంచీ భూకంపాల్ని రికార్డ్ చేస్తుంటే... ఇప్పటివరకూ వచ్చిన భూకంపాల్లో ఇది నాలుగో అతి పెద్ద భూకంపంగా నమోదైంది. దీని వల్ల ఏర్పడిన సునామీకి సముద్ర అలలు దాదాపు 133 అడుగుల ఎత్తుకి ఎగసిపడ్డాయి. జపాన్‌... తొహోకూలోని మియాకూలో ఈ అలల రికార్డు నమోదైంది. ఈ భూకంపం, సునామీకి సంబంధించి అప్పట్లో మనం చాలా రకాల వీడియోలు చూశాం. సముద్రంలో వాహనాలు, ప్రజలు కొట్టుకుపోవడం చూశాం. దీనిపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఐతే... అప్పట్లో ప్రపంచానికి తెలియని ఓ వీడియో ఫుటేజ్ ఇప్పుడు రిలీజైంది. అది జపాన్‌లోని సెండాయ్ ఎయిర్‌పోర్టులోని ఫుటేజ్. అది చూస్తే... భూకంపం ఎంత తీవ్రంగా వచ్చిందో, ఆ తర్వాత సునామీ ఎలా దూసుకొచ్చిందో అందులో కనిపిస్తోంది. మీరూ వీడియోని పూర్తిగా చూసి... ఆ క్షణాల్లో... ఆ ఎయిర్‌పోర్టులో ప్రజల ఆర్తనాదాలు, కేకలు, వాళ్లు పడిన కంగారూ అన్నీ తెలుసుకోండి.First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు