Home /News /trending /

SHOCKING CHINESE PEOPLE EAT FRIED DOG PRIVATE PART AS SNACKS HERE IS THE REASON SK

OMG: కుక్కల పురుషాంగాలకు అక్కడ భలే డిమాండ్.. నూనెలో ఫ్రై చేసుకొని లాగిస్తారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dog private Parts Fry: కుక్కల పురుషాంగాలను తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని చాలా మంది విశ్వసిస్తున్నప్పటికీ.. అది శాస్త్రీయంగా అది రుజువు కాలేదు. ఐనప్పటికీ ఎంతో మంది వాటిని నూనెలో వేయించుకొని.. స్నాక్స్‌లా తింటున్నారు.

  యావత్ ప్రపంచం ఇంకా కరోనావైరస్ (Corona Pandemic) భయంతో వణికిపోతోంది. రెండేళ్లుగా అల్లాడిపోతోంది. డెల్టా, ఒమిక్రాన్ అంటూ కొత్త కొత్త వేరియెంట్లు విరుచుకుపడుతున్నాయి. ఈ పరిస్థితికి చైనాయే కారణమని ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లోనే (Wuhan Lab) కోవిడ్19 (Covid-19) పుట్టిందని చాలా దేశాలు వేలెత్తిచూపిస్తున్నాయి. అక్కడి ప్రజల ఆహారపు అలవాట్ల వల్లే జంతువుల నుంచి కోవిడ్ సంక్రమించిందని చైనీయులపై మండిపడుతున్నారు. కుక్కలు, తేళ్లు, బొద్దింకలు, పాములు, పురుగులు.. ఇలా ఒక్కటా రెండా.. ఈ భూమిపై ఉండే ప్రతి ప్రాణాని చైనీయులు తింటున్నారని..అందుకే ఈ అడ్డమైన వ్యాధులు వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చైనాను చీదరించుకుంటున్నారు. ఈ క్రమంలో చైనీయుల ఆహారపు అలవాట్ల గురించి మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. చైనీయులు కుక్కలను ఎంతో ఇష్టంగా తింటారు. అక్కడ చాలా చోట్ల డాట్ మీట్ ఫెస్టివల్స్ (Dog Maet Festivals) కూడా జరుగుతున్నాయి. ఇంత వరకు ఓకే. కానీ కుక్కల పురుషాంగాలను చైనీయులు మరింత ఇష్టంగా లాగిస్తారట. వాటిని నూనెలో ఫ్రై చేసుకొని తింటారట.  Pink Handfish: ఆస్ట్రేలియాలో బయటపడ్డ పింక్ హ్యాండ్‌ఫిష్‌.. దీని ప్రత్యేకత ఏంటో  తెలుసా?

  కరోనా వల్ల చైనా అప్రతిష్ట పాలయింది. ఈ మహమ్మారి వల్లైనా చైనీయులు తమ తీరును మార్చుకుంటారని, ఇలాంటి ఆహారం పట్ల నిషేధం విధిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. తాజా వివారల ప్రకారం.. చైనాలో ఏటా కోటికిపైగా కుక్కలను మాంసం కోసం వినియోగిస్తున్నారట. తాజా మాంసంతో పాటు ప్రాసెస్ చేసి నిల్వచేసిన ఆహారాన్ని కూడా చైనాలో విక్రయిస్తున్నారు. సాసేజ్‌లు కూడా వాడుతున్నారు. ముఖ్యంగా కుక్కల పురుషాంగాలను (Dog Private Parts) ప్రాసెస్ చేసి..ప్యాకెట్లలో నిల్వచేసి అమ్ముతున్నారు. వాటిని నూనెలో వేయించుకొని చాలా మంది తింటారు. ఈవెనింగ్ స్నాక్‌గా బాగా ఎంజాయ్ చేస్తారట. కుక్కల పురుషాంగాలను తినడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడంతో పాటు కండ పుష్టి పెరుగుతుదని చైనీయులు నమ్ముతారు. అందుకే కుక్కల మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.  పుట్టిన 5 రోజులకే పీరియడ్స్.. పాపను ఎత్తుకొని ఆస్పత్రికి పరుగెత్తిన తల్లి.. ఏం జరిగిందంటే?

  చైనాలో పెంపుడు కుక్కలు అపహరణకు గురవుతుంటాయి. వాటిని కొందరు కేటుగాళ్లు చోరీచేసి మాంసం కోసం అమ్మేస్తుంటారు. కొందరైతే మన వద్ద కోళ్లు, గొర్రెలను పెంచినట్లుగా కుక్కులను కూడా మాంసం కోసమే పెంచుతున్నారు. 2020 మే 29న చైనాలో కుక్కల మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. ఐనప్పటికీ అక్రమంగా అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇంకా కుక్క మాంసం దొరుకుతోంది. ఇక కుక్కల పురుషాంగాల తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని చాలా మంది విశ్వసిస్తున్నప్పటికీ.. అది శాస్త్రీయంగా అది రుజువు కాలేదు. ఐనప్పటికీ ఎంతో మంది వాటిని నూనెలో వేయించుకొని.. స్నాక్స్‌లా తింటున్నారు. ఎగబడి మంరీ లాగించేస్తున్నారు. చైనా మాత్రమే కాదు.. థాయ్‌లాండ్, వియత్నం వంటి దేశాల్లోనూ ఓపెన్ మార్కెట్లోనే కుక్క మాంసం విక్రయిస్తారు. అంతెందుకు మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో పలుచోట్ల కూడా కుక్కల మాంసాన్ని అక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: China, Dog, Trending, VIRAL NEWS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు