హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video: ఫ్యాన్‌ను కొట్టేసిన స్టార్‌ క్రికెటర్‌! అంత కోపం ఎందుకు భయ్యా!

Video: ఫ్యాన్‌ను కొట్టేసిన స్టార్‌ క్రికెటర్‌! అంత కోపం ఎందుకు భయ్యా!

ఫ్యాన్‌ను కొడుతున్న షకీబ్

ఫ్యాన్‌ను కొడుతున్న షకీబ్

ఆట పరంగా క్రికెట్ వరల్డ్‌లో ఎంత ఫేమసో... వివాదాల్లో నిత్యం వార్తల్లో నిలవడంలో కూడా అంతే ఫేమస్‌! తాజాగా ఓ అభిమానిపై ఏకంగా చెయ్యి చేసుకున్నాడు ఈ స్టార్ క్రికెటర్

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎంత గొప్ప క్రికెటర్‌ ఐతేనేం.. బుద్ధి లేకపోతే ఎవరూ లైక్ చేయరు.. ఒకటి, రెండు సార్లు అంటే 'క్రికెటర్లు కూడా మనుషులేగా, వాళ్లకి కోపాలు ఉండవా' అనుకుంటారు కానీ.. ప్రతీసారి అలాంటి తప్పే చేస్తే మాత్రం తిట్టుకుంటారు. తన కోపమే తన శత్రువుంటారు అందుకే.. బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌, ప్రపంచంలో అత్యుత్తుమ ఆల్‌రౌండర్‌లలో ఒకరైన షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan).. ఆట పరంగా క్రికెట్ వరల్డ్‌లో ఎంత ఫేమసో... వివాదాల్లో నిత్యం వార్తల్లో నిలవడంలో కూడా అంతే ఫేమస్‌! తాజాగా ఓ అభిమానిపై ఏకంగా చెయ్యి చేసుకున్నాడు ఈ స్టార్ క్రికెటర్.. షకీబ్ అభిమాని(fan)ని కొట్టిన(Beat) వీడియో సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా మారింది.

క్యాప్‌తో కొట్టాడు:

బంగ్లాదేశ్‌ చట్టోగ్రాంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు షకీబల్ హసన్ వచ్చాడు. ప్రమోషనల్ ఈవెంట్ కోసం అతన్ని పిలిచినట్లు సమచారం. మన ఇండియాలోలాగే బంగ్లాదేశ్‌లో కూడా క్రికెటర్లకు యమ క్రేజ్‌ ఉంది. క్రికెటర్‌లను చూసేందుకు అభిమానులు రావడం.. ఎగబడడం సర్వసాధరణమే.. అందులో షకీబ్‌కు బంగ్లాదేశ్‌లో ఫ్యాన్‌బేస్‌ ఎక్కువ. దీంతో అతడిని చూసేందుకు బంగ్లా అభిమానులు ఎగబడ్డారు. ఇలా తనను చుట్టుముట్టిన వారిలో ఒక వ్యక్తిపై షకీబల్ హసన్‌ దాడి చేశాడు. చేతిలోని క్యాప్‌తో ఆ అభిమానిని చాలాసార్లు కొట్టాడు. వెంటనే జోక్యం చేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది కలగజేసుకొని ఈ స్టార్ క్రికెటర్‌ను పక్కకు తీసుకెళ్లిపోయారు. క్రికెట్‌లో మూడు ఫార్మెట్లలో అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా రాణిస్తోన్న షకీబ్‌ అల్‌ హసన్‌ ఇలా వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారేం కాదు.. తాజాగా క్యాప్‌తో దాడి ఘటనతో షకీబ్‌ బిహేవియర్‌పై సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. చాలామంది షకీబ్‌ ప్రవర్తనను తప్పుపడుతున్నారు.

అంత కోపం ఎందుకు భయ్యా.. గతంలోనూ.. ఇలానే:

షకీబ్ గతంలోనూ చాలాసార్లు సహనం కోల్పోయి గ్రౌండ్‌లోనే హద్దు దాటి ప్రవర్తించాడు. ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేవ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో వైడ్ ఇవ్వలేదని కోపంతో ఊగిపోయినషకిబ్‌ అల్‌ హసన్‌.. పెద్దగా అరుస్తూ అంపైర్ మీదకు దూసుకెళ్లాడు. సీమర్ రెజౌల్ రెహమాన్ రాజా వేసిన ఓ బంతి షకీబల్ పై నుంచి వెళ్లింది. అది వైడ్ అని నమ్మిన షకీబల్.. స్క్వేర్ లెగ్ అంపైర్ మహ్ఫుజుర్ రెహమాన్ వైపు చూశాడు. తొలి బౌన్సర్‌ అని అంపైర్ సిగ్నల్ ఇవ్వడంతో షకీబ్ కోపంతో ఊగిపోయాడు. అదే సమయంలో లెగ్ అంపైర్ వైపు వెళ్లాడు. క్రీజు వదిలి లెగ్ అంపైర్‌ దగ్గరకు వెళ్లిన షకిబ్‌ అల్‌ హసన్‌.. అతడితో వాదనకు దిగాడు. ఇక 2021లోనూ షకీబ్‌ అంపైర్‌ను కొట్టినంత పని చేశాడు. 2021 ఢాకాలో జరిగిన ప్రీమియర్‌ లీగ్‌లో సైతం షకిబ్‌ అల్‌ హసన్‌ ప్రవర్తన వివాదాస్పదమైంది. అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం తెచ్చుకున్న షకిబ్‌.. అంపైర్ ఎదురుగా ఉన్న వికెట్లు పీకేశాడు. తర్వాత అతని ప్రవర్తనపై అందరికి సారీ చెప్పాడు.

First published:

Tags: Bangladesh, Cricketer

ఉత్తమ కథలు