Home /News /trending /

OMG: లైవ్‌లో కూలిన టీవీ స్టూడియో సెట్.. యాంకర్‌కు గాయాలు.. వైరల్ వీడియో

OMG: లైవ్‌లో కూలిన టీవీ స్టూడియో సెట్.. యాంకర్‌కు గాయాలు.. వైరల్ వీడియో

OMG: లైవ్‌లో కూలిన టీవీ స్టూడియో సెట్.. యాంకర్‌కు గాయాలు.. వైరల్ వీడియో

OMG: లైవ్‌లో కూలిన టీవీ స్టూడియో సెట్.. యాంకర్‌కు గాయాలు.. వైరల్ వీడియో

యాంకర్‌పై స్టూడియో సెట్ పీస్ పడిపోవడంతో అక్కడే ఉన్న గెస్ట్‌లు షాక్ తిన్నారు. అది లైవ్ టెలికాస్ట్ అవుతుండంతో ఏమీ చేయకుండా అలాగే ఉండిపోయారు. అనంతరం సమయస్ఫూర్తితో వ్యవహరించి.. బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.

    టీవీ స్టూడియోలో లైవ్ డిస్కషన్ జరుగుతోంది. యాంకర్‌తో పాటు ప్యానెల్ సభ్యులు ఓ అంశంపై చర్చిస్తున్నారు. కానీ అంతోనే భారీ శబ్ధంతో సెట్ పీస్ పడిపోయింది. నేరుగా యాంకర్ మీద పడడంతో ఆయన నలిగిపోయాడు. కొలంబియాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొలంబియాలోని ESPN టీవీ స్టూడియోలో యాంకర్ కార్లోస్ ఆర్డుజ్ లైవ్ షో నిర్వహించారు. ఆ షోలో ఆయనతో పాలు మరికొందరు కూడా పాల్గొన్నారు. డిష్కషన్ జరుగుతున్న క్రమంలో ఆయన వెనక నుంచి సెట్ ప్రాపర్టీ పీస్ ఒకటి.. పెద్ద శబ్ధంతో పడిపోయింది. నేరుగా యాంకర్ మెడపై పడడంతో ఆయన కుప్పకూలాడు. ఐతే కార్లోస్‌కు పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


    యాంకర్‌పై స్టూడియో సెట్ పీస్ పడిపోవడంతో అక్కడే ఉన్న గెస్ట్‌లు షాక్ తిన్నారు. అది లైవ్ టెలికాస్ట్ అవుతుండంతో ఏమీ చేయకుండా అలాగే ఉండిపోయారు. అనంతరం సమయస్ఫూర్తితో వ్యవహరించి.. బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. కెమెరామెన్లు కూడా వెంటనే షాట్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



    ''నేను మెడికల్ చెకప్ చేయించుకున్నా. అంతా బాగానే ఉంది. ఎలాంటి ప్రమాదం లేదు. ముక్కుపై కొంత వాపు ఉంది. దేవుడి దయ వలన అంతకు మించి ఏమీ కాలేదు. ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదు. నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన వారిందరికీ ధన్యవాదాలు.'' అని కార్లోస్ తెలిపారు. కాగా, ఈ వీడియోను మైక్ సిింగ్టన్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. ఓ మై గాడ్ అంటూ చాలా మంది ట్వీట్ చేశారు. యాంకర్‌కు ఎలాంటి ముప్పు లేకపోడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International news, Trending, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు