నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే బీఎంసీ కాంట్రాక్టర్ను మురుగు నీటిలో కూర్చోబెట్టారు. అంతటితో ఆగకుండా అతడి చెత్తవేయించారు. ఐతే తాను చేసిన పనిని ఎమ్మెల్యే దిలీప్ లాండే సమర్థించుకున్నారు.
మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే రెచ్పిపోయారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కాంట్రాక్టర్కు బహిరంగంగా శిక్ష విధించారు. అతడిని మురుగు నీటిలోకి నెట్టేసి.. తలపై చెత్తను పోయించారు. ముంబైలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై సహా పలు ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతూ.. రోడ్లమైనే మురుగురు నీరు ప్రవహిస్తోంది. చందివాలీ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఐతే బీఎంసీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందని శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే మండిపడ్డారు. సదరు కాంట్రాక్టర్ను అక్కడికి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మనుషులతో అతడిని మురుగు నీటిలోకి నెట్టేశారు.
నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే బీఎంసీ కాంట్రాక్టర్ను మురుగు నీటిలో కూర్చోబెట్టారు. అంతటితో ఆగకుండా అతడి చెత్తవేయించారు. ఐతే తాను చేసిన పనిని ఎమ్మెల్యే దిలీప్ లాండే సమర్థించుకున్నారు. కాంట్రాక్టర్ సరిగా పనిచేయనందునే మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని అన్నారు. అందుకే అతడిపై చెత్తవేయించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఎమ్మెల్యే తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాంట్రాక్టర్ను నడిరోడ్డుపై ఇంతలా అవమానిస్తారా? శివసేన ఎమ్మెల్యే గూండాలా ప్రవర్తించారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే బ్లాక్ లిస్టులో పెట్టి, కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని గానీ.. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. అటు నెటిజన్లు కూడా ఎమ్మెల్యే తీరుపై విమర్శలు సంధిస్తున్నారు. మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.