Article 370: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఏకిపారేసిన శివసేన

Jammu Kashmir | ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్ముకశ్మీర్‌లో పుల్వామా తరహా దాడులు జరుగుతాయంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల పట్ల శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న పుల్వామా దాడిలో పాక్ ప్రేమయముందని ఇమ్రాన్ ఖాన్ తన వ్యాఖ్యలతో పరోక్షంగా అంగీకరించారని పేర్కొంది.

news18-telugu
Updated: August 9, 2019, 10:50 AM IST
Article 370: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఏకిపారేసిన శివసేన
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
news18-telugu
Updated: August 9, 2019, 10:50 AM IST
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకపడింది. ఆర్టికల్ 370 రద్దుతో పుల్వామా తరహా దాడులు జరగొచ్చంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపింది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న పుల్వామా దాడిలో పాక్ ప్రమేయం ఉందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల ద్వారా రూఢీ అయ్యిందని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ తన‌ సంపాదకీయంలో ధ్వజమెత్తింది. భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవడం ద్వారా పాక్ తనకు తాను ఇబ్బందులు సృష్టించుకుంటోందని సామ్నా ఎద్దేవా చేసింది.

భారత్‌తో పాక్ వాణిజ్య సంబంధాలను తెంచుకోవడం ద్వారా మన దేశానికి వచ్చే నష్టమేమీ లేదని పేర్కొంది. పాక్ నిర్ణయం భారత్ పురోగమనంపై ఏ మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని వ్యాఖ్యానించింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్‌ను బహిష్కరించాలని, పాక్ హైకమిషనర్‌‌ను భారత్‌కు పంపకూడదన్న పాక్ నిర్ణయాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. భారత గడ్డపై తీవ్రవాద దాడులకు పాల్పడే పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు పాక్ హైకమిషన్ తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

పాక్ అవాకులు చెవాకులు పేలడం మానుకుంటే మంచిదని సామ్నా హితవుపలికింది. ఓ వైపు భారత్‌తో చర్చల కోసం ప్రయత్నాలు చేస్తూ...మరోవైపు భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న పాక్ ఆటలు ఇక సాగవని పేర్కొంది.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...