హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shirdi Saibaba: సాయి సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం.. లడ్డూల తయారీ కోసం ప్రత్యేక పోటీలు..

Shirdi Saibaba: సాయి సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం.. లడ్డూల తయారీ కోసం ప్రత్యేక పోటీలు..

లడ్డూల తయారీ..

లడ్డూల తయారీ..

Maharashtra: మహారాష్ట్రలో షిర్డీ దేవాలయం లడ్డూ ప్రసాదంపై (Laddu prasadam) కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ ( Shirdi Saibaba Trust) దీనిపై చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా సాయి సంస్థాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇంకా చదవండి ...

Shirdi laddu prasadam: మహారాష్ట్రలో షిర్డీ దేవాలయం అత్యంత ప్రసిద్ది చెందిన ఆలయం. ఇది అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. మన్మాడ్ కు దగ్గరలో ఉంటుంది. షిర్డీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి భారత దేశమే కాక, విదేశాల నుంచి  పెద్ద ఎత్తున భక్తులు.. సాయిబాబాను దర్శించుకోవడానికి తరలివస్తారు. ఆయన తన భక్తులకు రెండు నినాదాలను ఇచ్చారు. ఇవి పాటించాలని చెబుతుండే వారు. అవే.. శ్రద్ధ (నమ్మకం), సబూరీ (విశ్వాసం). వీటిని బాబా భక్తులు నమ్మకంతో పాటిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో వెలసిన కలియుగ దైవం.. వెంకటేశ్వర స్వామి లాగా.. మహారాష్ట్రలో షిరిడీ సాయి బాబాను (Shirdi Saibaba Temple) భక్తులు కొలుస్తారు. పిలిచే దైవంగా భావిస్తారు. తిరుపతిలో లడ్డు గురించి ప్రత్యేకంగా చెప్ప నక్కర్లేదు. అది స్వామి వారికి ఎంత ఇష్టమో.. భక్తులకు కూడా అంతే ఇష్టం. అందుకే భక్తులు లడ్డులను కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రసాదంగా తమ ఇంటికి తీసుకెళ్తుంటారు. లడ్డూ ప్రసాదం (Laddu prasadam) కూడా.. అత్యంత రుచిగా ఉంటుంది. ఇక షిర్డీ ఆలయం ట్రస్ట్ వారు.. 1990 లో తిరుపతి ఆలయంలో మాదిరిగా.. షిర్డిలో కూడా దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డులను ప్రసాదంగా పంపిణీ చేయడాన్ని  ప్రారంభించారు.

మొదట్లో.. రెండు లడ్డూల ప్యాకెట్ ధర రెండు రూపాయలుగా నిర్ణయించారు. ఆ తర్వాత.. 1991 లో రెండు లడ్డులకు బదులు.. మూడు ప్యాకెట్ల లడ్డును తయారు చేసి ధరను మూడు రూపాయలుగా నిర్ణయించారు. ఇక.. క్రమంగా.. 2003లో రూ. 10., 2014 లో రూ. 20కి పెరిగింది. షిర్డీలో లడ్డు తయారు చేసే సంప్రదాయం దాదాపు ముఫ్పై ఏళ్లుగా కొనసాగుతుంది. ఇక భక్తులు కూడా పెద్ద మొత్తంలో లడ్డును కొనుగోలు చేస్తున్నారు. ఒకానోక సమయంలో భక్తులు (Devotees).. లడ్డు కొనుక్కొక పోతే.. షిర్డీయాత్ర పూర్తికాదని భావిస్తారు.

భారత దేశం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక వంటివి కలిపి బూందీ లడ్డు తయారు చేస్తారు. ఇక క్రమంగా డిమాండ్ పెరుగుతుండటంతో.. దానిపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. లడ్డూ ప్రసాదం కోసం క్యూలు కట్టడం ప్రారంభించారు. అదే విధంగా... క్యూలో ఉన్న ప్రతి భక్తుడికి రెండు ప్యాకెట్ల లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. రెండు రూపాయల లడ్డూ ప్యాకెట్ కాస్త.. ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలుగా మారింది.

ఒక ప్యాకెట్ బరువు 150 గ్రాములు మరియు మూడు లడ్డూలను కలిగి ఉంటుంది. ఒక్కో భక్తుడికి క్యూలో నుంచి రెండు లడ్డూ ప్యాకెట్లను అందజేస్తున్నారు. ఇంకా కావాల్సిన వారు, ఆ భక్తులు పదే పదే క్యూలో నిలబడి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఇంటికి తీసుకెళ్తారు. ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అవసరమైన మానవ వనరులను కూడా అందిస్తుంది. బూందీ తీయటం, లడ్డు తయారీ నుంచి నుండి పంపిణీ వరకు అన్నీ సాయి సంస్థాన్ పర్యవేక్షణలో ఉన్నాయి.

ఇటీవలి కాలంలో, దేశీయ నెయ్యితో తయారు చేసిన లడ్డూ ప్రసాదంలో తీపిదనం పెరగడం ప్రారంభమైంది. లడ్డులో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుందని  సంస్థాన్ కు  పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో సాయి సంస్థాన్ (Shirdi Sai baba Trust) దీనిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. అదే విధంగా, భక్తుల సూచనలను గౌరవిస్తూ, సాయి సంస్థాన్ ఇప్పుడు లడ్డులో క్వాలిటీని మెరుగుపరచ డానికి చర్యలు ప్రారంభించింది.

దీనిలో భాగంగానే.. ఇప్పుడు శ్రేష్ఠమైన, రుచికరమైన లడ్డూలను తయారు చేసేందుకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలలో.. మంచి రుచికరమైన  (Quality In Laddu) లడ్డూలు చేసిన వారిని ఎంపిక చేసి.. వారితో లడ్డూలను చేయించి భక్తులకు ప్రసాదంగా అందజేయనున్నారు. భక్తుల మనోభావాలు, సూచనలు పరిగణలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని సాయి సంస్థాన్  (Shirdi Sai baba Trust)అధ్యక్షుడు అశుతోష్ కాలే తెలిపారు.

First published:

Tags: Laddu, Maharashtra, Shirdi

ఉత్తమ కథలు