Home /News /trending /

SHEEP SENTENCED TO THREE YEARS IN JAIL FOR KILLING A WOMAN IN AFRICA FUNNY CASE GOES VIRAL PAH

Funny case: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష.. కారణం ఏంటంటే..

గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష

గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష

Africa: గొర్రె మహిళపై దాడిచేసింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోనికి వెళ్లింది.  దీంతో ఈ పంచాయతీ కాస్త కోర్టు వరకు వెళ్లింది.

ఒక్కొసారి కోర్టులు వింతగా తీర్పులు వెలువరిస్తుంటాయి. ఇలాంటి అనేక ఘటనలు గతంలోనూ  వార్తలలో నిలిచాయి. తాజాగా, ఈ కోవకు చెందిన  వింత ఘటన ఆఫ్రికాలో చోటు చేసుకుంది. ఒక మహిళను పొట్టేలు పరిగెత్తించింది. ఆమెను కిందపడేసి పదే పదే కొమ్ములతో కుమ్మింది. దీంతో మహిళ అపస్మాకర స్థితిలోనికి వెళ్లిపోయింది.

సోషల్ మీడియాలో ప్రతి రోజు వింత ఘటనలు, నవ్వుతెప్పించే సంఘటనలు వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు వీటిని చూడటానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని వింతగా ఉంటాయి. ప్రస్తుతం ఒక వింత ఘటన వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఆఫ్రికాలోని (Africa) సౌత్ సుడాన్ లో ఒక వింత ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మాన్యాంగ్ ధాల్ లో ఈ సంఘటన జరిగింది. అకుల్ యోల్ ప్రాంతంలో.. ఆదియు చాంపింగ్ (45) అనే మహిళపై, ఒక గొర్రె దాడిచేసింది. మహిళను కిందపడేసి పదే పదే కొమ్ములతో కుమ్మేసింది. (Chaping repeatedly) దీంతో మహిళ అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయింది. ఆమెను వెంటనే స్థానికులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమెను చూసిన డాక్టర్లు ఆమె పక్కటెముకలు విరిగిపోయాయని, అప్పటికే చనిపోయిందని తెలిపారు. దీంతో బాధిత తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సదరు గొర్రె .. రామ్ అనే వ్యక్తిది. మరణించిన మహిళ.. వీరికి సమీప బంధువుకూడా. అయితే... పోలీసులు పొట్టెలును, దాని యజమాని రామ్ ను అదుపులోనికి తీసుకున్నారు. వీరిని కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే, ఘటనను విచారించిన కోర్టు, వెరైటీ తీర్పును వెలువరించింది. ఘటనకు కారణమైన గొర్రెకు మూడేళ్ల పాటు జైలు శిక్షను విధించారు. (Sheep Sentenced To Three Years In Jail) అదే విధంగా, గొర్రె యజమానిని నిర్దోషి అని తేల్చింది.

అయితే, మరణించిన మహిళ కుటుంబానికి , ఐదు ఆవులను పరిహరంగా ఇవ్వాలని గొర్రె యజమానికి కోర్టు ఆదేశించింది. ఇక శిక్ష కాలంలో, గొర్రె సౌత్ సుడాలన్ లోని లేక్ స్టేట్ లోని ఆడ్యూల్ కౌంటి సైనిక శిబిరంలో గొర్రె మూడేళ్ల పాటు ఉంటుందని తీర్పు వెలువరించింది. అంతే కాకుండా, సౌత్ సుడాన్ చట్టాల ప్రకారం.. మూడేళ్లు శిక్ష పూర్తయ్యాక.. గొర్రె బాధిత కుటుంబానికి చెందుతుందని కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: South Africa, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు