‘ఆమెకు బుర్రే లేదు’: ఐఏఎస్‌ ఆఫీసర్‌పై ఎమ్మెల్యే కామెంట్స్

ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని సబ్ కలెక్టర్ అడ్డుకోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: February 10, 2019, 9:42 PM IST
‘ఆమెకు బుర్రే లేదు’: ఐఏఎస్‌ ఆఫీసర్‌పై ఎమ్మెల్యే కామెంట్స్
ఐఏఎస్ అధికారిణి రేణు రాజ్, ఎమ్మెల్యే రాజేంద్రన్
news18-telugu
Updated: February 10, 2019, 9:42 PM IST
కేరళలో అధికార పార్టీ ఎమ్మెల్యే మహిళా ఐఏఎస్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువుకుంటారు కానీ వాళ్లకు బుర్ర ఉండదంటూ ఎద్దేవా చేశారు. కేరళలో దేవికులం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్. రాజేంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా స్థానిక టీవీ ఛానళ్లలో ప్రసారం అయింది. అది పెద్ద దుమారం రేపింది. ఐఏఎస్ అధికారిణి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిచ్చింది.

ఐఏఎస్ అధికారిణి రేణు రాజ్, ఎమ్మెల్యే రాజేంద్రన్
ఐఏఎస్ అధికారిణి రేణు రాజ్, ఎమ్మెల్యే రాజేంద్రన్


సబ్ కలెక్టర్ అయిన రేణు రాజ్.. మున్నార్ హిల్ స్టేషన్‌లో నిర్మిస్తున్న ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌ను కట్టనివ్వలేదు. దీంతో ఎమ్మెల్యే రాజేంద్రన్‌కి కోపం వచ్చింది. అసలు పంచాయతీ ఆధీనంలో నిర్మించే భవనాల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కలెక్టర్‌కు ఎలాంటి అధికారం లేదని మండిపడ్డారు.

‘ఆమెకి అసలు బ్రెయిన్ లేదు. ఆమె కేవలం కలెక్టర్ కావడానికే చదివింది. వాళ్లకి దానికి సంబంధించిన బ్రెయిన్ మాత్రమే ఉంటుంది. ఆమెకి ప్లాన్, స్కెచ్‌ గురించి ఏం తెలుసు? పంచాయతీ నిర్మాణాల్లో కలెక్టర్ జోక్యం చేసుకోకూడదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాప్రతినిధులు చెప్పేది వినాలి’ అని రాజేంద్రన్ అన్నారు.ఇవి కూడా చదవండి

 
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...