జమ్ముకశ్మీర్‌పై అఫ్రిది ట్వీట్...భారత నెటిజన్స్ ఆగ్రహం

Shahid Afridi on Kashmir | జమ్ముకశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఐక్యరాజ్య సమితి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కోరారు. అఫ్రిది ట్వీట్‌పై భారత నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

news18-telugu
Updated: August 6, 2019, 7:29 AM IST
జమ్ముకశ్మీర్‌పై అఫ్రిది ట్వీట్...భారత నెటిజన్స్ ఆగ్రహం
Shahid Afridi on Kashmir | జమ్ముకశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఐక్యరాజ్య సమితి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కోరారు. అఫ్రిది ట్వీట్‌పై భారత నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
  • Share this:
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దీంతో పాటు జమ్ముకశ్మీర్, లడఖ్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఐరాస తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీలకు కనీస హక్కులు దక్కడం లేదన్నారు. ఐరాస‌ను ఎందుకు ఏర్పాటు చేశారు? అది ఎందుకు నిద్రపోతోందంటూ ప్రశ్నించారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలంటూ షాహిద్ అఫ్రిది ట్వీట్ చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంవహించాలని కోరారు. సదరు ట్వీట్‌ను ఐక్యరాజ్యసమితి, డొనాల్డ్ ట్రంప్‌కు ట్యాగ్ చేశారు.


అఫ్రిది ట్వీట్‌పై భారత నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ స్థాయిలో ట్రోల్స్‌తో దంచేశారు. ముందుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పాక్ సేనలు ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు.  కశ్మీర్ గురించి మాట్లాడుతున్న అఫ్రిది...బలూచిస్థాన్ గురించి కూడా స్పందించాలని ఓ నెటిజన్ సూచించారు. బలూచిస్థాన్‌లో పాక్ సేనల హక్కుల ఉల్లంఘనపై ఐరాస ఎందుకు మౌనంవహిస్తోందని ప్రశ్నించారు.

తన అసలు వయసేంటో తెలియని ఓ వ్యక్తి...కశ్మీర్ గురించి మాట్లాడుతున్నాడంటూ అఫ్రిదికి మరో నెటిజన్ చురకలు అంటించాడు.కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, దీనిపై మాట్లాడే అర్హత పాకిస్థాన్‌కు లేదని మరో నెటిజన్ మండిపడ్డాడు. పాక్ అంతర్గత అంశాలపై అఫ్రిది మాట్లాడితే మంచిదని సూచించారు.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading