షాకింగ్.. ఆరేళ్ల పిల్లలకు సెక్స్ పాఠాలు.. తల్లిదండ్రులు పరేషాన్..

Sex Education in Schools: యూకేలోని స్కూళ్లు కూడా పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పాఠాలు చెప్పేందుకు సిద్ధమయ్యాయి. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. ఆరేళ్ల వయసు నుంచే ఈ పాఠాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: September 23, 2019, 7:40 PM IST
షాకింగ్.. ఆరేళ్ల పిల్లలకు సెక్స్ పాఠాలు.. తల్లిదండ్రులు పరేషాన్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రేప్‌లు, లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న తరుణంలో సెక్స్ ఎడ్యుకేషన్ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా స్కూళ్లలో, ఇంట్లో.. చిన్న పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మధ్యే బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సహా పలువురు నటులు పాఠశాల స్థాయి నుంచి సెక్స్ గురించి తెలియజేయాలని, దాని ప్రాముఖ్యతను వివరించాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లైంగిక అవగాహన అనేది అందరికి ఉండాలని, ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా అవసరమని తెలిపారు. తాజాగా, యూకేలోని స్కూళ్లు కూడా పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పాఠాలు చెప్పేందుకు సిద్ధమయ్యాయి. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. ఆరేళ్ల వయసు నుంచే ఈ పాఠాలు చెబుతున్నాయి. దాదాపు 240కి పైగా ప్రైమరీ స్కూళ్లలో ‘మీ సెక్స్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో భాగంగా పాఠాలను బోధించనున్నారు.

‘టచింగ్ ప్రైవేట్ పార్ట్స్’ (జననాంగాల స్పర్శ) గురించి పిల్లలకు చెప్పనున్నట్లు అక్కడి విద్యాశాఖ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా.. పిల్లల జననాంగాలను అసభ్యంగా తాకడం, వారిని సెక్స్‌కు ప్రేరేపించడం లాంటివి చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని టీచర్లు విద్యార్థులను బోధించనున్నారు. అయితే, ఆరేళ్ల నుంచే పిల్లలకు సెక్స్ పాఠాలు నేర్పడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బోధనల వల్ల పిల్లలు చెడు దారి పట్టే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అంతేకాదు.. కొందరు తల్లిదండ్రులైతే.. సెక్స్ పాఠాలు నేర్పే స్కూళ్ల నుంచి తమ బిడ్డల అడ్మిషన్‌ను రద్దు చేసుకొని వేరే పాఠశాలకు పంపిస్తున్నారు.

కొందరు తల్లిదండ్రులతో పాటు, పలువురు సామాజిక కార్యకర్తలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంత చిన్న వయసు పిల్లలకు సెక్స్ గురించి, జననాంగాల గురించి చెప్పడం సరికాదని, సెక్స్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం అటుంచి, వారిలో విష బీజాలు నాటే ప్రయత్నం ఇది అని విమర్శిస్తున్నారు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>