ఆ గ్రామంలో పెళ్లికి ముందు శృంగారం కామనే..

శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడాలన్నా బోలెడన్నీ అభ్యంతరాలు, నిబంధనలు ఉంటాయి. కానీ.. ఓ గ్రామంలో పెళ్లికి ముందు సహజీవనం చేసుకోవడం కామనేనట.

news18-telugu
Updated: November 19, 2019, 6:33 PM IST
ఆ గ్రామంలో పెళ్లికి ముందు శృంగారం కామనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లికి ముందే శృంగారం అంటే.. చెంప పగులగొడతారు. పాశ్చాత్య దేశాల్లో కామనే అయినా ఇండియా మాత్రం కాదు. సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని హెచ్చరిస్తుంటారు. సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడాలన్నా బోలెడన్నీ అభ్యంతరాలు, నిబంధనలు ఉంటాయి. కానీ.. ఓ గ్రామంలో పెళ్లికి ముందు సెక్స్ కామనేనట. అదేదో.. అమెరికా, లండన్ అనుకోకండి.. ఇండియాలోనే. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాకు చెందిన ఓ గ్రామం అది. అక్కడ ఒకే తెగకు చెందిన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే.. సెక్స్ పట్ల వాళ్లది ఓపెన్ మైండ్. ఎంత ఓపెన్ మైండ్ అంటే.. పెళ్లి కాకున్నా ఒకే ఇంట్లో భార్యాభర్తల్లా కలిసి ఉండొచ్చు. సెక్స్ జీవితాన్ని స్వతంత్రంగా ఎంజాయ్ చేయవచ్చు. అడిగే వారు.. అడ్డు చెప్పేవారు ఉండరు. అక్కడ ఒక బిడ్డను కన్న తర్వాత కూడా పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. అక్కడి సమాజం ఎవ్వరినీ వేలెత్తి చూపదు. ఇలా ఎందుకు చేశావ్? అన్న ప్రశ్నే తలెత్తదు. అక్కడి చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే ఆ తెగకు చెందినవారు కూడా ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు. అయితే.. ఇదేదో ఇప్పుడొచ్చిన సంప్రదాయం కాదట. ఏళ్లుగా అక్కడ ఇదే విధానం కొనసాగుతోందట.

ఛత్తీస్‌గఢ్‌లోనే కాదు రాజస్థాన్‌లోని గరాసియా అనే తెగ ప్రజలు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మాయికైనా, అబ్బాయికైనా సరే.. తనకు ఇష్టమైన వ్యక్తిని ప్రేమించే, పెళ్లి చేసుకునే లేక.. సహజీవనం చేసుకునే హక్కు ఉంది. అక్కడ చాలా మంది పెళ్లి చేసుకోకుండా లివింగ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లోనే కొనసాగుతున్నారు.
First published: November 19, 2019, 6:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading