హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Work From Home: వర్క్ ఫ్రం హోంతో ఉద్యోగుల్లో పెరుగుతున్న ఒత్తిడి.. లాంగ్ వీకెండ్ హీలీడేను ప్రకటించిన పలు కంపెనీలు!

Work From Home: వర్క్ ఫ్రం హోంతో ఉద్యోగుల్లో పెరుగుతున్న ఒత్తిడి.. లాంగ్ వీకెండ్ హీలీడేను ప్రకటించిన పలు కంపెనీలు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Work From Home: కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో గత ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా అన్ని సాఫ్ట్వేర్, అనుబంధ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే.

  కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో గత ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా అన్ని సాఫ్ట్వేర్, అనుబంధ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేయాల్సి రావడం మరియు సాధారణంగా ఉండే శనివారం, ఆదివారం వీక్ ఆఫ్ రోజుల్లో కూడా ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు స్పందించాల్సి రావడంతో ఉద్యోగుల్లో రోజురోజుకూ పని ఒత్తిడి పెరిగిపోతుంది. తద్వారా కొన్ని సార్లు నిద్ర లేని రాత్రులను కూడా గడపాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న భారతీయ ఉద్యోగులపై చేసిన ఒక సర్వేలో దాదాపు 36 శాతం మంది ఉద్యోగులు మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తేలింది.

  దీంతో తమ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని పలు కంపెనీలు ఎక్స్ట్రా డే ఆఫ్ను ప్రకటిస్తున్నాయి. దీనిలో భాగంగానే ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగులకు ఎక్స్‌ట్రా డే ఆఫ్‌ని ప్రకటించింది.దీని ప్రకారం వర్క్ ఫ్రం హోంలో ఉన్న గూగుల్ కంపెనీకి చెందిన ఉద్యోగులు ఇక నుంచి శని, ఆది వారాలతో పాటు శుక్రవారాన్ని కూడా వీకాఫ్‌గా పొందవచ్చు. గూగుల్ నిర్ణయాన్ని అనుసరిస్తూనే పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాయి.

  తాజాగా పీడబ్ల్యూసీ కంపెనీ తమ ఉద్యోగులకు ఈ రోజు (అక్టోబర్ 5)న ‘పెన్ డౌన్ డే’గా ప్రకటించింది. దీంతో కంపెనీ ఉద్యోగులకు నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ హాలిడే అవకాశాన్ని కల్పించింది. కాగా, అంతకు ముందే పెప్సికో ఇండియా కూడా తమ ఉద్యోగులకు నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ హాలీడేను ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా తమ ఉద్యోగులకు అక్టోబర్ 1న సెలవు ప్రకటించింది.

  అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున నేషనల్ హాలిడే, తర్వాత శని, ఆది వారాలు వీకాఫ్ కావున వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు కల్పించింది. దీనిపై కంపెనీ సీహెచ్ఆర్ఓ పవిత్రా సింగ్ మాట్లాడుతూ ‘‘మా కంపెనీ ఉద్యోగులు పని ఒత్తిడికి లోనవ్వకుండా ఉండేందుకు అక్టోబర్ 1ని సెలవుగా ప్రకటించి నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ హాలిడేను ప్రకటించాం. ఈ నిర్ణయంతో మా ఉద్యోగులు రిలాక్స్ అవ్వడమే కాకుండా తమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపడానికి సమయం దొరకుతుంది. తద్వారా వారు మరింత నూతన ఉత్తేజంతో పని చేస్తారు. ఈ విపత్కర సమయంలోనూ మా ఉద్యోగులు చేస్తున్న హార్డ్వర్క్కు కృతజ్ఞతగా ఈ లాంగ్ వీకెండ్ అవకాశాన్ని కల్పించాం’’ అని ఆమె పేర్కొన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Work From Home

  ఉత్తమ కథలు