Home /News /trending /

SEVEN VETS ASSIGNED DUTY FOR TREATING FATEHPUR DISTRICT MEGISTARE COW PVN

జనాల సొమ్మేగా : కలెక్టర్ గారి ఆవుకి అనారోగ్యం..చికిత్స కోసం ఏడుగురు డాక్టర్లని నియమిస్తూ ఆదేశాలు!

ఫతేఫూర్ కలెక్టర్ ఆవుకి ట్రీట్మెంట్ వివాదాస్పదం

ఫతేఫూర్ కలెక్టర్ ఆవుకి ట్రీట్మెంట్ వివాదాస్పదం

Seven Vets For DM Cow Treatment : సాధారణంగా ఎక్కడైనా పెంపుడు జంతువులంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. పెంపుడు జంతువులు తమ యజమాని కోసం ప్రాణాలు పణంగా పెట్టడం,ప్రాణంగా పెంచుకునే పెంపుడు జంతువుల కోసం యజమానులు ప్రాణాలోదిలిన సందర్భాలు అనేకం.

ఇంకా చదవండి ...
Seven Vets For DM Cow Treatment : సాధారణంగా ఎక్కడైనా పెంపుడు జంతువులంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. పెంపుడు జంతువులు తమ యజమాని కోసం ప్రాణాలు పణంగా పెట్టడం,ప్రాణంగా పెంచుకునే పెంపుడు జంతువుల కోసం యజమానులు ప్రాణాలోదిలిన సందర్భాలు అనేకం. అయితే ఆక్సిజన్‌ అందక అరవై మంది పసిపిల్లలు చనిపోయిన, శవాలు గంగా నదిలో తేలిన ఉత్తరప్రదేశ్‌(UttarPradesh) రాష్ట్రంలో ఒక కలెక్టర్ కి చెందిన ఆవుకు అనారోగ్యం చేసిందని దాని ట్రీట్మెంట్ కు ఏడుగురు వైద్యులను నియమించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్(Fathepur) జిల్లాలో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్ జిల్లా మేజిస్ట్రేట్ అనుప్రియా దూబే(Anupriya Dube)కి చెందిన ఓ ఆవు ఇటీవల అస్వస్థతకు గురయ్యింది. దీంతో ఆవు చికిత్సకు(Cow Treatment), దాన్ని చూసుకోవడానికి జిల్లా చీఫ్‌ వెటర్నరీ(CVO) అధికారి ఎస్‌కే తివారీ ఏడుగురు వెటర్నరీ డాక్టర్లను(Veterinary Doctors) నియమించారు. అస్వస్థతకు గురైన ఆవును ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తనిఖీ చేసి సంబంధిత నివేదికను చీఫ్ వెటర్నరి అధికారికి అందజేయాలని పశువైద్యాధికారులను ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. డాక్టర్ ఎస్‌కే తివారీ పేరు మీద జూన్ 9న జారీ చేయబడిన ఈ ఉత్తర్వులు తాజాగా బయటికొచ్చారు. ఎస్‌కే తివారీ జారీ చేసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రజలు ఆగ్రహిస్తే అంతే : తమ మాట పట్టించుకోవట్లేదని..అధికార పార్టీ ఎమ్మెల్యేనే బంధించిన గ్రామస్తులు!

అయితే, 2017లో కూడా ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అప్పటి అధికారపార్టీ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌కు చెందిన గేదెలు పోయాయి. ఆ గేదెలను గుర్తించేందుకు పోలీసుల బలగాలు రంగంలోకి దిగాయి. ఆ గేదెల కోసం తీవ్రంగా గాలించారు. చివరకు కుక్కల సాయంతో గేదెలను పోలీసులు గుర్తించారు.కలియుగ బకాసురుడు..వండిపెట్టడానికే ఇద్దరు భార్యలు..అతడి తిండికి భయపడి బంధువులు పంక్షన్లకు పిలవట్లేదట!

కాగా, ఇటీవల ఐఏఎస్(IAS) అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు వరసగా వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు క్రీడాకారులను ముందుగానే స్టేడియం నుంచి ఖాళీ చేయించడం ఇటీవల వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.ఢిల్లీలోని త్యాగరాజ్‌ స్టేడియం... సాధారణంగా సాయంత్రం ఏడు గంటలవరకు క్రీడాకారులు, శిక్షకులతో బిజీ ఉంటుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) సంజీవ ఖిర్వార్‌ మాత్రం ఆ స్టేడియాన్ని తన పెంపుడు కుక్కతో వాకింగ్‌ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇందుకోసం నిర్ణీత సమయం కంటే ముందే క్రీడాకారులను స్టేడియం నుంచి వెళ్లగొట్టాలని నిర్వాహకులకు సూచించారు. దీంతో సాయంత్రం ఏడు గంటలకంటే ముందు క్రీడాకారులు, శిక్షకులను బయటకు పంపిస్తున్నారు. అనంతరం ఓ అరగంట తర్వాత ఆ ఐఏఎస్‌ అధికారి తన పెంపుడు శునకంతో అక్కడకు చేరుకొని తాపీగా వాకింగ్‌ చేసుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఐఏఎస్‌ అధికారి చేస్తున్న నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాత్రి 8.30 వరకు సాధన చేసేవాళ్లమని,ఐఏఎస్‌ అధికారి తీరుతో తమకు ఆటంకం కలుగుతోందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. స్టేడియాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై...సంజీవ ఖిర్వార్ దంపతుల​ను బదిలీ చేసింది. AGMUT క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్​ అధికారి ఖిర్వార్‌ను లద్దాఖ్​కు, ఆయన భార్య అను దుగ్గాలను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Collector, Cow, Doctors, Treatment, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు