హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Australia:బ్రిస్బేన్‌లో భారీ వర్షాలు, వరదలు..వేలది ఇళ్లు నాశనం

Australia:బ్రిస్బేన్‌లో భారీ వర్షాలు, వరదలు..వేలది ఇళ్లు నాశనం

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Australia: ఆస్ట్రేలియాలోని మూడో అతిపెద్ద జనాభా నివాస ప్రాంతంలో వరదలు సంభవించాయి. భారీ వర్షాలతో ఇళ్లు, కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. జలప్రళయానికి ఏడుగురు మృతి చెందారు.

ఆస్ట్రేలియాలో జలప్రళయం విరుచుకుపడింది. ఎప్పుడూ ఊహించని విధంగా అత్యధిక వర్షపాతం నమోదవడంతో వందలాది మంది జలదిగ్భందంలో చిక్కుకుపోయారు. వేలాది ఇళ్లు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. , వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 48గంటల క్రితం కురిసిన భారీ వర్షానికి ఆస్ట్రేలియా(Australia)లోని తూర్పు తీర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వరదలు నివాస పట్టణాన్ని ముంచెత్తాయి. ఆస్ట్రేలియాలోనే అత్యధిక జనాభా నివసించే నగరమైన బ్రిస్బేన్‌ (Brisbane)లోని కొన్ని ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. జలప్రళయం సృష్టించిన బీభత్సానికి క్వీన్‌లాండ్స్‌(Queensland)ప్రాంతంలోనే సోమవారం రాత్రి వరకు ఏడుగురు మృతి (seven people Killed )చెందినట్లుగా అక్కడి వాతావరణ, విపత్తు నిర్వాహణశాఖ అధికారులు వెల్లడించారు. బ్రిస్బేన్‌తో పాటు దాని చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో సుమారు 2,145ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. మరో 10,827 నివాస సముదాయాలు పాక్షింకగా నీళ్లలో తేలుతున్నాయి.వరదల కారణంగా బ్రిస్బేన్‌ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం నాటికి నదిలో 3.85ఎం నీటిశాతం ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఇంతటి ప్రమాదకరమైన వర్షాలు, వరదలు రావడం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. వరద ప్రవాహం తీవ్రతకు నగరంలోని కాలనీలు, ఇళ్లు, రోడ్లు పూర్తిగా జలమయం కావడంతో గజఈతగాళ్లతో పాటు డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌ టీమ్స్‌ కలిసి 130 సహాయకబృందాలు వరద బాధితుల్ని ఆదుకునేందుకు 24గంటలుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. బ్రిస్బేన్‌ లాంటి సీల్డ్‌ సిటీ నీళ్లలో తేలుతున్న దృశ్యాలు భయాందోళనను కలిగిస్తున్నాయి. గత 11సంవత్సరాలుగా బ్రిస్బేన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 2.6మిలియన్ల జనాభా (2.6 million people)నివసిస్తున్నారు. అలాంటి నగరానికి గడిచిన వందేళ్లలో ఇలాంటి వరద బీభత్సం, భారీ వర్షాలు చూడలేదని అభిప్రాయపడుతున్నారు.

బ్రిస్బేన్‌లో జలప్రళయం..

ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు పొంచివున్న ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షితంగా పవర్‌ బోట్ల సాయంతో బయటకు తెస్తున్నారు. ఇళ్లు, తిండి, తిప్పలు లేకుండా బాధపడుతున్న వారిని పునరావాసకేంద్రాలకు తరలిస్తున్నట్లుగా బ్రిస్బేన్‌ అధికారులు స్పష్టం చేశారు. ఇళ్లు, కార్లు అన్నీ వరద నీళ్లతో మునిగిపోవడంతో స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. భారీ వర్షాలు ఇంతటి వరద ప్రమాదాన్ని సృష్టిస్తాయని ఊహించలేకపోయమన్నారు.

వందేళ్లలో ఎప్పుడూ చూడని బీభత్సం..

రోడ్లపై పీకల్లోతు నీళ్లలో పిల్లల్ని భుజాలపై ఎత్తుకొని వరద ముంపు నుంచి బయటపడేందుకు బ్రిస్బేన్‌ ప్రాంత ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. బ్రిస్బేన్‌లోని ఉత్తర ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు వరదలున్న క్రీక్‌ను దాటడానికి ప్రయత్నించి కంచెకు తగిలి మునిగిపోయాడని క్వీన్స్‌లాండ్ రాష్ట్ర పోలీసులు సోమవారం వెల్లడించారు. వరదల్లో ఇంకా ఎంత మంది మునిగిపోయారు. ప్రవాహంలో ఎంత మంది గల్లంతయ్యారనే విషయంపై కారణంగా మునిగిపోయాడు, క్వీన్స్‌లాండ్ రాష్ట్ర పోలీసులు సోమవారం తెలిపారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Australia, Floods

ఉత్తమ కథలు